News March 29, 2025

అనకాపల్లి: జిల్లా విద్యాశాఖ వెబ్ సైట్ ప్రారంభం

image

అనకాపల్లి జిల్లా విద్యాశాఖ వెబ్ సైట్ శనివారం ప్రారంభమైంది. ఈ వెబ్‌సైట్‌ను జిల్లా విద్యాశాఖ అధికారి అప్పారావు నాయుడు తన కార్యాలయంలో ప్రారంభించారు. అనకాపల్లి జిల్లాకు సంబంధించిన సమాచారం ఉపాధ్యాయుల సౌకర్యార్థం వెబ్ సైట్‌‌లో ఉంచడం జరుగుతుందని అన్నారు. జిల్లాలో పదవ తరగతి ఒకేషనల్ ఎడ్యుకేషన్ పరీక్షకు 4,803 మంది విద్యార్థులు హాజరైనట్లు డీఈఓ తెలిపారు. 196 మంది గైర్హాజర్ అయినట్లు పేర్కొన్నారు.

Similar News

News December 9, 2025

పాకిస్థాన్‌కు మరిన్ని నిధులు ఇచ్చిన IMF

image

దాయాది దేశం పాకిస్థాన్ ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. దీంతో అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (IMF) మరోసారి భారీ ఆర్థిక సహాయం అందించింది. తాజాగా 1.2 బిలియన్ డాలర్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పాక్‌కు ఇప్పటివరకు వచ్చిన మొత్తం నిధులు సుమారు 3.3B డాలర్లకు చేరాయి. ఆ దేశం గత కొన్నేళ్లుగా ఎక్కువగా బయటనుంచి వచ్చే <<16600466>>ఆర్థిక సాయం<<>>పైనే ఆధారపడుతోంది. 2023లో త్రుటిలో డిఫాల్ట్‌ను తప్పించుకుంది.

News December 9, 2025

ముదిగొండ: కోతులు, కుక్కల బెడద నివారించేవారికే ఓటు!

image

గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ముదిగొండలో యువకులు వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. గ్రామంలో తీవ్రంగా ఉన్న కోతులు, కుక్కల బెడదను నివారించే అభ్యర్థికే తమ ఓటు వేస్తామంటూ ఫ్లెక్సీ ఏర్పాటు చేసి ర్యాలీ నిర్వహించారు. ఈ సామాజిక సమస్యను పరిష్కరించడానికి ఎవరైతే స్పష్టమైన హామీ ఇస్తారో వారినే గెలిపిస్తామని యువకులు స్పష్టం చేశారు. వారి ఈ నిర్ణయం స్థానికంగా చర్చనీయాంశమైంది.

News December 9, 2025

హైదరాబాద్‌లోని NI-MSMEలో ఉద్యోగాలు..

image

HYDలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ మైక్రో, స్మాల్ & మీడియం ఎంటర్‌ప్రైజెస్‌(NI-<>MSME<<>>)లో 3 అసోసియేట్ ఫ్యాకల్టీ పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. ME, ఎంటెక్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గల వారు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 40ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. దరఖాస్తు ఫీజు రూ.1000. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: www.nimsme.gov.in