News February 7, 2025
అనకాపల్లి: టీచర్‌పై పోక్సో కేసు నమోదు

బుచ్చయ్యపేట వడ్డాది ప్రైవేట్ స్కూల్లో విద్యార్థినిపై అసభ్యకరంగా ప్రవర్తించిన టీచర్ గంగా ప్రసాద్ పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ తుహీన్ సిన్హా శుక్రవారం తెలిపారు. అనంతరం నిందితుడిని చోడవరం కోర్టులో ప్రవేశ పెట్టగా 14 రోజులు రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు. పాఠశాలలు, కళాశాలల్లో గుడ్ టచ్.. బ్యాడ్ టచ్‌పై అవగాహన సదస్సులు నిర్వహిస్తామన్నారు.
Similar News
News November 23, 2025
SRSPకి భారీగా తగ్గిపోయిన ఇన్ ఫ్లో

SRSPలోకి ఇన్ ఫ్లో భారీగా తగ్గిపోయింది. గడిచిన 24 గంటల్లో SRSPలోకి ఎగువ ప్రాంతాల నుంచి 1,338 క్యూసెక్కుల ఇన్ ఫ్లో రాగ అంతే మొత్తం నీటిని దిగువకు వదిలినట్లు ప్రాజెక్టు అధికారులు ఆదివారం తెలిపారు. సరస్వతీ కెనాల్‌కు 650, మిషన్ భగీరథకు 231 క్యూసెక్కుల నీరు వదిలామన్నారు. కాగా ప్రాజెక్టులో పూర్తి స్థాయిలో 80.501 TMCల నీరు నిల్వ ఉందన్నారు.
News November 23, 2025
సాయి బోధనలతో జీవితంలో ప్రశాంతత: VVS లక్ష్మణ్

భగవాన్ శ్రీ సత్యసాయిబాబా శత జయంతి సందర్భంగా క్రికెట్ దిగ్గజం వీవీఎస్ లక్ష్మణ్ బాబాను స్మరించుకున్నారు. ప్రేమ, సేవ, కరుణతో కూడిన బాబా సందేశం తమకు నిరంతరం మార్గదర్శకంగా ఉంటుందని ఆయన తెలిపారు. ఆ మహనీయుని ఆశీస్సులు, స్ఫూర్తి ఎల్లప్పుడూ అందరిపై ఉండాలని లక్ష్మణ్ ఆకాంక్షించారు.
News November 23, 2025
ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో దుమ్మురేపిన లక్ష్యసేన్

భారత బ్యాడ్మింటన్ ప్లేయర్ లక్ష్యసేన్ ఆస్ట్రేలియన్ ఓపెన్ 2025లో అద్భుత విజయం సాధించారు. జపాన్ ఆటగాడు యూషీ తనాకాపై 21-15, 21-11 తేడాతో జయకేతనం ఎగరవేశారు. దీంతో సైనా నెహ్వాల్, కిదాంబి శ్రీకాంత్ తర్వాత ఆస్ట్రేలియన్ ఓపెన్ గెలిచిన మూడో భారత ఆటగాడిగా లక్ష్య నిలిచారు. ఈ సీజన్లో అతనికి ఇదే తొలి BWF టైటిల్. అలాగే తన కెరీర్లో మూడో సూపర్ 500 టైటిల్.


