News February 7, 2025
అనకాపల్లి: టీచర్‌పై పోక్సో కేసు నమోదు

బుచ్చయ్యపేట వడ్డాది ప్రైవేట్ స్కూల్లో విద్యార్థినిపై అసభ్యకరంగా ప్రవర్తించిన టీచర్ గంగా ప్రసాద్ పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ తుహీన్ సిన్హా శుక్రవారం తెలిపారు. అనంతరం నిందితుడిని చోడవరం కోర్టులో ప్రవేశ పెట్టగా 14 రోజులు రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు. పాఠశాలలు, కళాశాలల్లో గుడ్ టచ్.. బ్యాడ్ టచ్‌పై అవగాహన సదస్సులు నిర్వహిస్తామన్నారు.
Similar News
News February 8, 2026
విద్యార్థులకు అస్వస్థత.. కారకులపై CM సీరియస్

AP: పోలవరం(D) దేవరపల్లి ఆశ్రమ బాలుర హాస్టల్ విద్యార్థులు అస్వస్థతకు గురవ్వడానికి గల కారకులపై CM CBN ఆగ్రహం వ్యక్తం చేశారు. రేపటిలోగా నివేదిక అందజేయాలని ఆదేశించారు. బాధ్యులపై శాఖాపరమైన, అవసరాన్ని బట్టి క్రిమినల్ చర్యలు తీసుకోవాలన్నారు. కాగా నిన్న టిఫిన్ చేశాక 92మంది విద్యార్థులకు కడుపునొప్పి, జ్వరం రావడంతో ఆస్పత్రులకు తరలించామని అధికారులు వివరించారు. ప్రస్తుతం వారి పరిస్థితి కుదుటపడిందన్నారు.
News February 8, 2026
MDK: BJP ఛైర్మన్ ఉంటేనే కేంద్ర నిధులు ఆగం కావు: MP

మున్సిపాల్ ఛైర్మన్ పోస్టులో బీజేపీ అభ్యర్థులు కూర్చుంటేనే కేంద్రం నిధులు ఆగం కాకుండా అభివృద్ధి చేస్తారని MP రఘునందన్ రావు అన్నారు. ఆదివారం మెదక్ పార్లమెంట్ పరిధిలోని గుమ్మడిదలలో మున్సిపల్ ప్రచారంలో పాల్గొని మాట్లాడారు. పల్లెలు, పట్టణాల అభివృద్ధికి నిధులు ఇచ్చేది కేంద్రమే అన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలో దేశ ప్రజల కష్టాలు తీరుతున్నాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రజలకు చేసిందేమీ లేదని విమర్శించారు.
News February 8, 2026
ప్రతి తప్పుకు శిక్ష ఉంటుంది!

గరుడ పురాణం ప్రకారం మనం చేసే ప్రతి కర్మకు ఫలితం ఉంటుంది. పాపపుణ్యాల తీవ్రతను బట్టి నరకంలోని శిక్షలు ఉంటాయి. స్వర్గంలోని లోకాలు మారుతుంటాయి. ఈ లోకాలు భువర్లోకం నుంచి సత్యలోకం వరకు ఉంటాయి. జ్ఞానం, భక్తి, త్యాగాల ద్వారా వైకుంఠం, కైలాసం వంటి ఉన్నత స్థితిని పొందవచ్చు. స్వర్గనరకాలు మనం ఎంచుకున్న మార్గాలేనని, జీవితం పరీక్ష అయితే ‘కర్మ’ తుది తీర్పు అని ఈ పురాణం హెచ్చరిస్తోంది. సత్కర్మలే సద్గతికి ఆధారం.


