News April 21, 2025

అనకాపల్లి: ‘టీనేజ్ ప్రెగ్నెన్సీ‌తో అనర్థాలు’

image

అనకాపల్లి: బాల్య వివాహలను కట్టడి చేయడంలో మహిళా పోలీసులది కీలక పాత్ర వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ ఏ. సూర్యకుమారి తెలిపారు. కలెక్టరేట్‌లో పలువురి అధికారులతో సోమవారం సమావేశమయ్యారు. పరిశ్రమలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో మహిళా ఉద్యోగులకు లైంగిక వేధింపులపై అవగాహన కల్పించాలన్నారు. టీనేజ్ ప్రెగ్నెన్సీ‌తో కలిగే అనర్థాలపై ఎక్కువగా అవగాహన కల్పించాలని ఆదేశించారు.

Similar News

News April 22, 2025

విశాఖ: మేడ మీద నుంచి పడి వివాహిత మృతి

image

మేడ మీద బట్టలు ఆరవేయడానికి వెళ్లి వివాహిత మృతి చెందిన ఘటన విశాఖలో సోమవారం చోటుచేసుకుంది. 61వ వార్డు ఇండస్ట్రీ కాలనీలో నివాసముంటున్న కోమలి తన ఇంటి మూడో అంతస్తులో బట్టలు ఆరవేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు కాలుజారి కిందపడిపోయింది. వెంటనే కుటుంబ సభ్యులు గమనించి కళ్యాణి ఆసుపత్రికి తరలించగా.. మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. భర్త శ్రీనుబాబు మల్కాపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

News April 22, 2025

రేపే రిజల్ట్.. సత్యసాయి జిల్లా విద్యార్థుల ఎదురుచూపు

image

పదో తరగతి పరీక్షల ఫలితాల విడుదలకు సర్వం సిద్ధమైంది. రేపు ఉదయం 10 గంటలకు మంత్రి నారా లోకేశ్ ఫలితాలను విడుదల చేయనున్నారు. శ్రీ సత్యసాయి జిల్లాలో 23,730 మంది విద్యార్థులు ఉన్నారు. మార్చి 17 నుంచి ఏప్రిల్ 1 వరకు పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే.
☞ వే2న్యూస్ యాప్‌లోనూ ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.

News April 22, 2025

రేపే రిజల్ట్.. అనంతపురం జిల్లా విద్యార్థుల ఎదురుచూపు

image

పదో తరగతి పరీక్షల ఫలితాల విడుదలకు సర్వం సిద్ధమైంది. రేపు ఉదయం 10 గంటలకు మంత్రి నారా లోకేశ్ ఫలితాలను విడుదల చేయనున్నారు. అనంతపురం జిల్లాలో 32,803 మంది విద్యార్థులు ఉన్నారు. మార్చి 17 నుంచి ఏప్రిల్ 1 వరకు పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. ☞ వే2న్యూస్ యాప్‌లోనూ ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.

error: Content is protected !!