News March 20, 2025
అనకాపల్లి: టెన్త్ స్పాట్ వాల్యుయేషన్పై వినతి

10th స్పాట్ వాల్యుయేషన్ డ్యూటీ నుంచి కొందరు టీచర్లకు మినహాయింపు ఇవ్వాలని అనకాపల్లి DEO అప్పారావునాయుడుని PRTU బుధవారం కోరింది. 55సంవత్సరాలు దాటినవారికి, వికలాంగులకు, దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్నవారికి, ప్రత్యేక అవసరాలుగల పిల్లలు ఉన్నవారికి తప్పకుండా మినహాయింపు ఇవ్వాలని PRTU అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు గోపినాథ్ వినతి ఇచ్చారు. వినతిపై DEO సానుకూలంగా స్పందించారని ఆయన తెలిపారు.
Similar News
News October 28, 2025
ఐరాల: ప్రమాదకరంగా రాకపోకలు

ఐరాల మండలంలోని ఉప్పరపల్లె గ్రామస్థులు నీవా నదిపై ప్రమాదకరంగా రాకపోకలు సాగిస్తున్నారు. పాతపేట వద్ద ఇటీవల తాత్కాలికంగా నదిపై దారి ఏర్పాటు చేసుకున్నారు. వర్షాల నేపథ్యంలో దారి కొట్టుకుపోయింది. దీనిపై ఒక స్తంభాన్ని ఏర్పాటు చేసుకుని రాకపోకలు కొనసాగిస్తున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి వంతెన నిర్మించి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని వారు కోరుతున్నారు.
News October 28, 2025
ADB: అక్రమార్కులకు రాజకీయ అండదండలు..!

జిల్లాలో కొందరు రాజకీయ నాయకుల ముసుగులో రౌడీషీటర్లు, గూండాలు అక్రమ దందాలకు పాల్పడుతున్నట్లు ఫిర్యాదులు వెలుగు చూస్తున్నాయి. నేతల అండతోనే రౌడీషీటర్లు చెలరేగిపోతున్నారని తెలుస్తోంది. ఎస్పీ అఖిల్ మహాజన్ ప్రత్యేక దృష్టి సారించి, రౌడీషీటర్ల అక్రమ భాగోతాలను వెలికితీస్తున్నారు. బాధితులు ధైర్యంగా ముందుకు రావడంతో, పోలీసులు కొరడా ఝళిపించి ఇటీవల భూదందాలు, పలు వివాదాల్లోని రౌడీషీటర్లు, నాయకులను జైలుకు పంపారు.
News October 28, 2025
‘మీ ఫోన్ ఏమైంది?’ జనార్దనరావుకు సిట్ ప్రశ్నలు

AP: నకిలీ మద్యం కేసులో సిట్ అధికారులు జనార్దనరావును అతని ఫోన్ గురించి అడిగినట్లు తెలుస్తోంది. ‘SA వెళ్లాక మీ ఫోన్ ఏమైంది? ఆధారాలు బయట పడతాయని ధ్వంసం చేశారా? ములకలచెరువులో నకిలీ మద్యం యూనిట్ వెలుగుచూశాకే మీ ఫోన్ పోయిందా?’ అని ప్రశ్నలు సంధించినట్లు సమాచారం. తన ఫోన్ చోరీకి గురైందని, ఎలా పోయిందో తెలియలేదని జనార్దనరావు సమాధానమిచ్చినట్లు తెలుస్తోంది. అందులో ఆధారాలున్నాయా? అని అడగ్గా మౌనంగా ఉండిపోయారు.


