News January 30, 2025

అనకాపల్లి: ‘తప్పులు లేకుండా సరిచేసుకోవాలి’

image

ఉపాధ్యాయుల బదిలీలు ఈ ఏడాది జరుగుతాయని అనకాపల్లి డీఈవో జీ.అప్పారావు నాయుడు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. గతంలో ఆన్‌లైన్లో నమోదు చేసుకున్న ఉపాధ్యాయుల సీఎస్ఈ వెబ్ సైట్‌లో టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టంలో తప్పులు లేకుండా చూసుకోవాలని ఆయన సూచించారు. ప్రతి ఉపాధ్యాయుడు తన వ్యక్తిగత లాగిన్(డీడీవో లాగిన్‌)లో తప్పులను ఈనెల 31వ తేదీలోగా సరి చేసుకోవాలన్నారు.

Similar News

News February 22, 2025

చరిత్ర సృష్టించిన ఆర్సీబీ ప్లేయర్

image

WPLలో ఆర్సీబీ ప్లేయర్ ఎలీసా పెర్రీ చరిత్ర సృష్టించారు. WPLలో అత్యధిక పరుగులు చేసిన రెండో బ్యాటర్‌గా రికార్డు నెలకొల్పారు. లీగ్‌లో ఇప్పటివరకు ఆమె 745 పరుగులు సాధించారు. అగ్ర స్థానంలో మెగ్ లానింగ్ (777) ఉన్నారు. మరోవైపు 700 పరుగులు చేసిన తొలి ఆర్సీబీ ప్లేయర్‌గానూ అరుదైన ఫీట్ నెలకొల్పారు. ముంబైతో జరిగిన మ్యాచులో ఆమె ఈ ఘనత సాధించారు.

News February 22, 2025

ఉమ్మడి జిల్లాలో నేటి..TOP NEWS!!

image

✔మానేసిన విద్యార్థులను తిరిగి పాఠశాలకు చేర్పింలి: కలెక్టర్లు
✔పాలమూరులో భారీ అగ్నిప్రమాదం
✔రైతు భరోసాకే దిక్కులేదు.. ఇండ్లు ఎలా ఇస్తారు: మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్
✔ఘనంగా అంతర్జాతీయ మాతృ భాష దినోత్సవం
✔GDWL:AP పోలీసులు దౌర్జన్యం చేశారు:BRS
✔ప్రపంచం సోషలిజం వైపు చూస్తోంది:CPM
✔NRPT: మహిళా పెట్రోల్ బంకును ప్రారంభించిన సీఎం
✔హామీలపై(BRS,BJP) చర్చకు సిద్ధమా:CM రేవంత్‌రెడ్డి

News February 22, 2025

ఐకానిక్ టవర్‌ నిర్మాణం కోసం కమిటీ

image

AP: అమరావతిలో NRT సొసైటీ ఐకాన్ టవర్ ప్రాజెక్ట్ నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఓ కమిటీ వేసింది. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అధ్యక్షుడిగా ఉండే ఈ కమిటీలో 9 మంది అధికారులు సభ్యులుగా ఉండనున్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసే బాధ్యతను ఈ కమిటీకి అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా అమరావతికి ఒక ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చేందుకు ఈ ప్రాజెక్టును సర్కార్ నిర్మిస్తోంది.

error: Content is protected !!