News February 13, 2025
అనకాపల్లి: తీర్థానికి వస్తుండగా యువకుడు మృతి

కె.కోటపాడు-మేడిచర్ల రోడ్డులోని డంపింగ్ యార్డ్ సమీపంలో గురువారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మలుపు వద్ద బైకు అదుపుతప్పి చోడవరం(M) గవరవరం గ్రామానికి చెందిన అప్పికొండ కిరణ్ (21) మృతి చెందాడు. విశాఖలో ఉంటున్న కిరణ్ స్వగ్రామమైన గవరవరంలో గ్రామదేవత తీర్థానికి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. మృతుని తండ్రి బాబురావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కే.కోటపాడు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News February 19, 2025
భార్య కాపురానికి రావడం లేదని భర్త ఆత్మహత్య..

భార్య కాపురానికి రావడంలేదని మనస్థాపానికి గురై భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన మద్నూర్ మండలంలో జరిగింది. SI విజయ్ కొండ వివరాలిలా..హండే కల్లూర్ వాసి సురేష్ (35) తో భార్య దేవ్ బాయ్ 5 ఏండ్ల క్రితం గొడవపడి పుట్టింటికి వెళ్లింది. అప్పటి నుంచి సురేష్ మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలో ఈ నెల 16న ఇంటి నుంచి వెళ్లి పోయాడు. ఆచూకీ కోసం వెతకగా సలాబత్ పూర్ బోడ బావి దగ్గర శవమై కనిపించాడు. పిర్యాదు మేరకు కేసు నమోదైంది.
News February 19, 2025
గండికోటలో సెల్ఫీ తీసుకున్న అజయ్ జైన్, కలెక్టర్, MLA

గండికోటను ప్రపంచ స్థాయిలో ప్రఖ్యాత పర్యాటక కేంద్రంగా ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి ఇక్కడ వనరులు పుష్కలంగా ఉన్నాయని రాష్ట్ర పర్యాటక శాఖ ప్రత్యేక కార్యదర్శి అజయ్ జైన్ అన్నారు. ఇక్కడి ప్రకృతి ఆస్వాదించారు. అనంతరం కలెక్టర్ చెరుకూరి శ్రీధర్, ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డితో గండికోట లోయ అందాల వద్ద సెల్ఫీ దిగారు.
News February 19, 2025
బిక్కనూర్: రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం

కామారెడ్డి జిల్లా బిక్కనూర్ మండంలో రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. బీటీఎస్ చౌరస్తా వద్ద కొత్తపల్లి అఖిల్ (27) బైకు పై వెళ్తుండగా చెట్టును ఢీకొట్టాడు. దీంతో తీవ్రగాయాలు కావటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.