News March 18, 2025
అనకాపల్లి: తొలి రోజు 195 మంది విద్యార్థులు గైర్హాజరు

అనకాపల్లి జిల్లాలో మొదటిరోజు పదో తరగతి పరీక్షకు 195 మంది విద్యార్థులు గైర్హాజరు అయ్యారు. జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 107 కేంద్రాల్లో పరీక్ష ప్రశాంతంగా జరిగింది. 21,162 మంది విద్యార్థులకు 20,967 మంది విద్యార్థులు హాజరైనట్లు జిల్లా విద్యాశాఖ అధికారి అప్పారావు నాయుడు తెలిపారు. ఏడు స్క్వాడ్ బృందాలు 44 పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశాయని అన్నారు.
Similar News
News October 18, 2025
శ్రీవారి భక్తులకు TTD ఛైర్మన్ విజ్ఞప్తి

శ్రీవారి దర్శన టిక్కెట్లు కోసం దళారులు, మధ్యవర్తులను నమ్మి మోసపోవద్దంటూ TTD ఛైర్మన్ బీఆర్ నాయుడు ‘X’ వేదికగా కోరారు. ఇటీవల పలువురు పెద్దమొత్తంలో డబ్బులు అప్పజెప్పి మోసపోతున్న ఘటనలు బయటపడ్డాయన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానాల అధికారిక వెబ్‌సైట్‌ల ద్వారా మాత్రమే తమ దర్శన టిక్కెట్లను బుక్ చేసుకోవాలని ఆయన భక్తులకు విజ్ఞప్తి చేశారు. దళారుల చేతిలో ఎవరన్నా మోసపోతే పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఆయన కోరారు.
News October 18, 2025
తిరుపతి: పండుగ వేళ దోచేస్తున్నారు..!

దీపావళి నేపథ్యంలో తమిళనాడు, తెలంగాణ, కర్నాటక నుంచి తిరుపతికి ప్రైవేట్ బస్సుల ఛార్జీలకు అమాంతం రెక్కలొచ్చాయి. బెంగళూరు నుంచి వారాంతంలో సీటర్ రూ.600, స్లీపర్ రూ.1000 ఉండగా ఇప్పుడు ఆ ధరలు ఏకంగా రూ.1-2 వేల మధ్య ఉన్నట్లు తెలుస్తోంది. ఆపరేటర్లు ఇష్టారాజ్యంగా ఛార్జీలు పెంచితే ఎలా అని ప్రయాణికులు మండిపడుతున్నారు. ఈ ఛార్జీలు భరించలేక కొందరు బైకులపై సొంతూర్లకు చేరుకుంటున్నారు.
News October 18, 2025
డిమాండ్లు తీరుస్తాం… వైద్యులు విధుల్లో చేరాలి: ప్రభుత్వం

AP: PHCల వైద్యులు వెంటనే విధుల్లో చేరాలని వైద్యారోగ్య శాఖ కార్యదర్శి సౌరభ్‌గౌర్ సూచించారు. PG మెడికల్ ఇన్‌సర్వీస్ కోటాను ఈఏడాది అన్ని కోర్సుల్లో కలిపి 20% అమలుకు GO ఇస్తామని వారితో చర్చల్లో వెల్లడించారు. ట్రైబల్ అలవెన్సు తదితర డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. అయితే PGలో 15% కోటా 3ఏళ్లు ఇవ్వాలని సంఘం నేతలు కోరగా దీనిపై ప్రభుత్వం నవంబర్లో నిర్ణయం తీసుకుంటుందని గౌర్ చెప్పారు.