News February 5, 2025
అనకాపల్లి: ‘దరఖాస్తుల స్వీకరణకు గడువు పెంపు’

అనకాపల్లి జిల్లాలో గీత కులాల వారికి కేటాయించిన 15 మద్యం షాపులకు దరఖాస్తుల స్వీకరణకు గడువును ఈనెల 5 నుంచి 8వ తేదీ వరకు పొడిగించినట్లు అనకాపల్లి జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి వి.సుధీర్ ఒక ప్రకటనలో తెలిపారు. వీరు సాధారణ లైసెన్స్ ఫీజులో సగం మాత్రమే చెల్లించాల్సి ఉంటుందన్నారు. గీత కులాల వారు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
Similar News
News November 4, 2025
గచ్చిబౌలి: కో-లివింగ్‌లో RAIDS.. 12 మంది అరెస్ట్

గచ్చిబౌలి TNGOకాలనీలోని కో-లివింగ్ రూమ్స్‌లో పోలీసులు మెరుపుదాడులు చేశారు. డ్రగ్స్ పార్టీ చేసుకుంటున్న 12 మందిని SOT పోలీసులు అరెస్ట్ చేశారు. కర్ణాటక నుంచి డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తోన్న గుత్తా తేజతో పాటు మరో నైజీరియన్ హైదరాబాద్ యువతకు అమ్ముతున్నట్లు గుర్తించారు. ఈ రైడ్స్‌లో ఆరుగురు డ్రగ్ పెడ్లర్స్, ఆరుగురు కన్జ్యూమర్స్‌ను అదుపులోకి తీసుకున్నారు. MDMAతో పాటు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
News November 4, 2025
అభివృద్ధికి నోచుకోని కందగిరి.. బండరాళ్లే మెట్లు!

జిల్లాలోని కురవి(M) కందికొండ శివారు కందగిరి కొండపై ప్రాచీన కాలం నాటి కట్టడాలు ఉన్నా, అభివృద్ధి జాడ కనిపించడం లేదు. రెండున్నర కి.మీ. ఎత్తులో ఉన్న శ్రీ లక్ష్మీనరసింహాస్వామి ఆలయానికి భక్తులు బండరాళ్లే మెట్లుగా చేసుకుని ఎక్కుతున్నారు. గతంలో కేటీఆర్ ఇక్కడ మెట్లు నిర్మిస్తామని హామీ ఇవ్వగా, 2019లో శంకుస్థాపనతోనే ఆ పనులు నిలిచిపోయాయి. పచ్చని చెట్లతో ఆహ్లాదకరంగా ఉండే ఈ ప్రాంతం అభివృద్ధికి నోచుకోవడం లేదు.
News November 4, 2025
నాలాను పరిశీలించిన మేయర్, కమిషనర్

గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 11వ డివిజన్ పోతన నగర్లో మేయర్ గుండు సుధారాణి, కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ పర్యటించి నాలాను పరిశీలించారు. వరద నీరు నిల్వ ఉండకుండా చర్యలు చేపట్టాలని స్థానిక అధికారులకు వారు సూచనలు చేశారు. వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు మేయర్ సూచనలు చేశారు.


