News March 17, 2025

అనకాపల్లి: దెబ్బతిన్న రైల్వే ట్రాక్.. నిలిచిన రైళ్లు

image

అనకాపల్లి జిల్లా విజయరామరాజుపేటలో రైల్వే వంతెన కుంగింది. రాత్రి రైల్వే వంతెన కింద నుంచి వెళ్తున్న ఓ భారీ వాహనం గడ్డర్‌ను ఢీకొనడంతో అండర్ బ్రిడ్జి వద్ద రైల్వే ట్రాక్ దెబ్బతింది. ఈ నేపథ్యంలో కశింకోటలో గోదావరి, విశాఖ ఎక్స్‌ప్రెస్‌లు, యలమంచిలిలో మహబూబ్‌నగర్ ఎక్స్‌ప్రెస్‌ను అధికారులు నిలిపివేశారు. దీంతో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు.

Similar News

News March 18, 2025

ADB: ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త

image

ఈనెల 18 నుంచి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ శంషాబాద్‌కు ప్రతిరోజు ఆదిలాబాద్ ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి రెండు సర్వీసులు ప్రారంభిస్తున్నట్లు డిపో మేనేజర్ కల్పన తెలిపారు. ఈ బస్సులు ప్రతిరోజు మధ్యాహ్నం 3, రాత్రి 9:30 గంటలకు బయలుదేరుతాయన్నారు. తిరుగుప్రయాణంలో ఎయిర్ పోర్ట్ నుంచి ఉదయం 5 గంటలకు, 11:30 గంటలకు బస్ ఉంటుందన్నారు. ఈ సేవలను ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

News March 18, 2025

రచయిత మృతిపై సంతాపం వ్యక్తం చేసిన రాజమౌళి

image

మలయాళ రచయిత గోపాలకృష్ణన్ మృతిపై దర్శకుడు రాజమౌళి సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మరణవార్త బాధించిందని ఆత్మకు శాంతికలగాలని Xలో ఫోస్ట్ చేశారు. ‘ఈగ’ ‘బాహుబలి’ ‘RRR’ చిత్రాల మలయాళ వెర్షన్‌కు గోపాలకృష్ణ పనిచేశారు.

News March 18, 2025

సిద్దిపేట: లిఫ్ట్ గుంతలో కుళ్లిన శవం లభ్యం

image

ములుగు మండలం లక్ష్మక్కపల్లి శివారులో ఓ కంపెనీ నిర్మాణ లిఫ్టు గుంతలో కూలిన శవం లభించినట్లు ఎస్ఐ విజయ్ కుమార్ తెలిపారు. ములుగు మండలం తానేదార్ పల్లికి చెందిన జామకాయల నర్సింలు (42) ఇంటి నుంచి వెళ్లి రెండు నెలలుగా కనిపించకుండా పోయాడు. కుటుంబ సభ్యలు పోలీసులకు ఫిర్యాదు చేయగా మిస్సింగ్ కేసు నమోదు చేశారు. సోమవారం కుళ్లిన స్థితిలో నర్సింలు శ్యామ్ లభించినట్లు ఎస్ఐ తెలిపారు.

error: Content is protected !!