News February 18, 2025
అనకాపల్లి: దొంగతనం కేసులో నిందితుడి అరెస్ట్

అనకాపల్లి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో పెద్ద మాకవరం గ్రామంలో జరిగిన చోరీ కేసులో నిందితుడిని అరెస్టు చేసినట్లు రూరల్ సీఐ అశోక్ కుమార్ తెలిపారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ నెల 13న దాసరి నారాయణరావు ఇంటిలో, అలాగే ప్రత్తిపాడులో జరిగిన బైక్ దొంగతనం కేసుల్లో నిందితుడైన గెంజి మంగరావును మంగళవారం అరెస్టు చేసినట్లు తెలిపారు. అతడి వద్ద 2 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.
Similar News
News December 5, 2025
కరీంనగర్: అభ్యర్థులకు కోతుల ‘పంచాయితీ’..!

కరీంనగర్ జిల్లాలోని పల్లెల్లో పంచాయతీ ఎన్నికల సందడి జోరందుకుంది. తొలి విడత పోలింగ్ జరిగే గ్రామాల్లో అభ్యర్థులు ప్రచారం ముమ్మరం చేశారు. గ్రామంలోని కోతుల ‘పంచాయితీ’ తీరిస్తేనే ‘పంచాయతీ’ పట్టం కడతామంటూ పలుచోట్ల అభ్యర్థులకు ఓటర్లు తెగేసి చెప్తున్నారు. దీంతో చేసేది లేక సమస్య తీరుస్తామని అభ్యర్థులు హామి ఇస్తున్నారు. మరి మీ గ్రామంలోనూ కోతుల సమస్య ఉందా?.
News December 5, 2025
ఇండిగో సంక్షోభం.. కేంద్రం సీరియస్

ఇండిగో విమాన సర్వీసుల అంతరాయాన్ని కేంద్రం తీవ్రంగా పరిగణించింది. ఈ సంక్షోభంపై ఉన్నతస్థాయి దర్యాప్తుకు ఆదేశిస్తున్నట్లు ప్రకటించింది. ఇందుకు కారణమైన వారిని కఠినంగా శిక్షిస్తామని స్పష్టం చేసింది. ప్రయాణికుల సంక్షేమం, భద్రతపై ప్రత్యేక దృష్టి సారించినట్లు పేర్కొంది. మూడు రోజుల్లో సమస్యను పూర్తిగా పరిష్కరిస్తామని వెల్లడించింది. పైలట్ల రోస్టర్ సిస్టమ్ను తాత్కాలికంగా నిలిపివేసినట్టు చెప్పింది.
News December 5, 2025
ఇవాళే ‘అఖండ-2’ రిలీజ్?

నందమూరి బాలకృష్ణ నటించిన ‘అఖండ-2’ చిత్రాన్ని ఇవాళ రాత్రి ప్రీమియర్స్తో విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్టు వార్తలొస్తున్నాయి. సమస్యలన్నీ కొలిక్కి రావడంతో ఏ క్షణమైనా మూవీ రిలీజ్పై ప్రకటన వచ్చే అవకాశం ఉందని సినీవర్గాలు తెలిపాయి. ఇవాళ సెకండ్ షోతో ప్రీమియర్స్, రేపు ప్రపంచవ్యాప్త విడుదలకు కసరత్తు చేస్తున్నట్లు పేర్కొన్నాయి. లేకపోతే ఈనెల 19కి రిలీజ్ పోస్ట్పోన్ కానున్నట్లు సమాచారం.


