News February 18, 2025

అనకాపల్లి: దొంగతనం కేసులో నిందితుడి అరెస్ట్

image

అనకాపల్లి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో పెద్ద మాకవరం గ్రామంలో జరిగిన చోరీ కేసులో నిందితుడిని అరెస్టు చేసినట్లు రూరల్ సీఐ అశోక్ కుమార్ తెలిపారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ నెల 13న దాసరి నారాయణరావు ఇంటిలో, అలాగే ప్రత్తిపాడులో జరిగిన బైక్ దొంగతనం కేసుల్లో నిందితుడైన గెంజి మంగరావును మంగళవారం అరెస్టు చేసినట్లు తెలిపారు. అతడి వద్ద 2 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.

Similar News

News March 23, 2025

BJP మెడలు వంచి తీరుతాం: కేటీఆర్

image

TG: బీజేపీ బలంగా ఉన్న ప్రాంతాల్లో సీట్లు పెంచి, దక్షిణాదిలో తగ్గించే కుట్ర చేస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. బీజేపీ మెడలు వంచైనా ఇక్కడ సీట్లు పెంచుకుంటామని చెప్పారు. ‘డీలిమిటేషన్‌తో దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. సౌత్ స్టేట్స్ ఏం తప్పు చేశాయి? జనాభా నియంత్రణ పాటించినందుకా ఈ శిక్ష? దక్షిణాదికి అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోం’ అని ఆయన ఫైర్ అయ్యారు.

News March 23, 2025

తిరువూరు: ప్రమాదంలో తల్లీ, కొడుకు మృతి

image

తిరువూరుకు చెందిన తల్లీ, కుమారుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఘటన ఆదివారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు భద్రాది జిల్లాలో దమ్మపేట (M) గాంధీనగర్ వద్ద ఎదురుగా వస్తున్న లారీ, బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ వస్తున్న తల్లీ, కుమారుడు స్పాట్‌లోనే మృతి చెందారు. మృతులు తిరువూరు (M) ముష్టికుంట్లకు చెందిన సరస్వతి (70), కృష్ణ (54)గా గుర్తించారు. బంధువుల ఇంటికి వెళ్లి వస్తుండగా ప్రమాదం జరిగింది.

News March 23, 2025

విశాఖలో రేపే మ్యాచ్..

image

దేశంలో IPL ఫీవర్ స్టార్ట్ అయింది. శనివారం నుంచి మ్యాచ్‌లు మొదలు కాగా క్రికెట్ అభిమానులు ఉర్రూతలూగుతున్నారు. కాగా ఈ ఏడాది విశాఖ 2 మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇస్తున్న సంగతి తెలిసిందే. సోమవారం విశాఖలో జరిగే ఢిల్లీ- లక్నో మ్యాచ్‌కు ఏర్పాట్లన్నీ పూర్తి చేసినట్లు ACA తెలిపింది. రేపు సాయంత్రం 6.30 నుంచి మెగా సెలబ్రేషన్స్‌తో విశాఖలో ఐపీఎల్ సందడి మొదలు కానుంది. రాత్రి 7.30కు మ్యాచ్ ప్రారంభమవుతుంది.

error: Content is protected !!