News February 25, 2025
అనకాపల్లి నియోజకవర్గ సమన్వయకర్తగా పంచకర్ల

జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలను మార్చి 14న పిఠాపురంలో నిర్వహిస్తున్న నేపథ్యంలో అనకాపల్లి ఎంపీ నియోజకవర్గానికి పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్ బాబును సమన్వయకర్తగా పవన్ కళ్యాణ్ నియమించారు. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. పార్లమెంటు పరిధిలో అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్చార్జిలు, పీఓసీలు పార్టీ మండల అధ్యక్షులతో సమావేశాలు నిర్వహించి ఆవిర్భావ దినోత్సవ వేడుకలను విజయవంతం చేయాలి.
Similar News
News November 15, 2025
బిహార్: ఓట్ షేరింగ్లో ఆర్జేడీనే టాప్

బిహార్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఓట్ షేర్ పరంగా చూసుకుంటే తేజస్వీ పార్టీ ఆర్జేడీ(23%)దే అత్యధికం. అయినప్పటికీ ఈ పార్టీ 25 స్థానాల్లోనే గెలిచింది. అటు 20.08% ఓట్లతో బీజేపీకి అత్యధికంగా 89 సీట్లు, 19.25% ఓట్లతో జేడీయూకు 85 సీట్లు వచ్చాయి. కాంగ్రెస్కు 8.71శాతం(6సీట్లు) ఓట్లు రాగా, ఇతరులకు 17శాతం రావడం గమనార్హం.
News November 15, 2025
భూకంపాలను పసిగట్టే ప్రాచీన భారత టెక్నాలజీ

భూకంపాలను గుర్తించే సాంకేతికత ఇప్పటికీ ఆధునిక ప్రపంచానికి సవాలే. కానీ, వేల ఏళ్ల క్రితమే మన భారతీయ శాస్త్రాలు భూకంపాల పూర్వ సూచనలను చెప్పే గొప్ప జ్ఞానాన్ని ప్రపంచానికి అందించాయి. సుమారు 1,500 సంవత్సరాల క్రితం వరాహమిహిరుడు రచించిన బృహత్సంహిత అనే గ్రంథంలో, భూకంపాలకు ముందు ప్రకృతిలో వచ్చే అసాధారణ వాతావరణ మార్పులను (పశుపక్ష్యాదుల ప్రవర్తన, భూగర్భ జలాల్లో మార్పులు) క్షుణ్ణంగా వివరించారు. <<-se>>#VedikVibes<<>>
News November 15, 2025
CII సదస్సు.. 13 లక్షల ఉద్యోగాలు: రాష్ట్ర ప్రభుత్వం

AP: సీఐఐ సదస్సులో తొలి రోజు 365 సంస్థలతో రూ.8,26,668 కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు జరిగినట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. సమ్మిట్ ముందు రోజుతో కలిపి 400 MoUలు, రూ.11,99,971 కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదిరాయని పేర్కొంది. దీంతో 13,32,445 మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయని వెల్లడించింది. ఇదంతా రాష్ట్ర ప్రభుత్వంపై పెట్టుబడిదారులు పెట్టుకున్న విశ్వాసాన్ని మరోసారి రుజువుచేసిందని తెలిపింది.


