News October 21, 2024
అనకాపల్లి: నీటి వినియోగదారుల సంఘాల ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ

అనకాపల్లి జిల్లాలో నీటి వినియోగదారుల సంఘాల ఎన్నికలకు గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసినట్లు కలెక్టర్ విజయకృష్ణన్ తెలిపారు. కలెక్టరేట్‌లో సోమవారం ఆమె మాట్లాడుతూ.. జిల్లాలో ఒక మేజర్, 3 మీడియం, ఒక మైనర్ నీటి ప్రాజెక్టు సంఘాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లా పరిధిలో సాగునీటి వనరుల కింద ఉన్న 303 సాగునీటి సంఘాలకు అక్టోబర్ 21 నుంచి నవంబర్ 29వ తేదీ వరకు వివిధ దశలలో ఎన్నికలు జరుగుతాయన్నారు.
Similar News
News November 2, 2025
విశాఖలో కార్డన్ అండ్ సెర్చ్.. 9వాహనాలు సీజ్

విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చి ఆదేశాల మేరకు ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్ల పరిధిలో శనివారం “కార్డన్ & సెర్చ్” ఆపరేషన్ నిర్వహించారు. ప్రతి ఇంటిని నిశితంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీలలో సరియైన ధృవపత్రాలు లేని 9 వాహనాలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ దృష్ట్యా కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించినట్లు తెలిపారు.
News November 1, 2025
పర్యాటక ప్రాంతాలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలి: కలెక్టర్

నగరంలోని పార్కులను, పర్యాటక ప్రాంతాలను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ ఆదేశించారు. నగరంలోని పలు పార్కులను ఆయన సందర్శించారు. ఈనెల 14, 15వ తేదీల్లో జరిగే ప్రపంచ స్థాయి భాగస్వామ సదస్సుకు దేశ విదేశాల నుంచి ప్రముఖులు నగరానికి వస్తారని తెలిపారు. అందుకు తగ్గట్టు చర్యలు చేపట్టాలని సూచించారు.
News November 1, 2025
విశాఖ నుంచి బయల్దేరిన మంత్రి లోకేశ్

విశాఖ విమానాశ్రయానికి మంత్రి నారా లోకేష్, కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు శనివారం సాయంత్రం చేరుకున్నారు. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ తొక్కిసిలాట ఘటనలో క్షతగాత్రులను వీరు పరామర్శించనున్నారు. ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని కూడా పరిశీలించారు. విశాఖ నుంచి రోడ్డు మార్గంలో మంత్రులు లోకేష్, అనిత, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు బయలుదేరి వెళ్లారు.


