News March 21, 2024

అనకాపల్లి: నీళ్ల తొట్టిలో పడి బాలుడు మృతి

image

అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలం వాలాబు పంచాయితీలోని కోడాపల్లిలో ఘోరం జరిగింది. గ్రామానికి చెరుకు చంద్రరావు, జానకి దంపతుల ఏడాదిన్నర కుమారుడు గణేష్ ప్రమాదవశాత్తు నీళ్ల తొట్టిలో పడి మృతి చెందాడు. తొట్టిలో పడిన బాలుడిని దేవరాపల్లి పీహెచ్సీకి చికిత్స నిమిత్తం తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనతో బాలుడి తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

Similar News

News April 23, 2025

విశాఖలో నేటి కాయగూరల ధరలు

image

విశాఖలోని 13 రైతు బజార్‌లలో కొనుగోలు చేసే కూరగాయల ధరలను వ్యవసాయ మార్కెటింగ్ శాఖ అధికారులు బుధవారం ఈ విధంగా నిర్ణయించారు. ఉల్లి రూ.18, వంకాయలు రూ.15, బంగాళాదుంపలు రూ.18,కాకరకాయ రూ.30,బీరకాయలు రూ.32,బెండకాయలు రూ.22,క్యాబేజీ రూ.16,గుమ్మడి కాయ రూ.16,గోరు చిక్కుడు రూ.28,పొటల్స్ రూ.30,టమాటా రూ.16, క్యారట్ రూ.30/32,బీన్స్ రూ.52,కీర దోస రూ.22,బద్ద చిక్కుడు కాయ రూ.50,అల్లం రూ. 44,మిర్చి రూ.25గా ఉన్నాయి.

News April 23, 2025

విశాఖ పోలీసులను అభినందించిన నేపాల్ పోలీసులు

image

నేపాల్‌కు చెందిన ఓ మహిళ తప్పిపోయి విశాఖలో ఉన్నట్లు నేపాల్ పోలీసులు గమనించారు. ఈ మేరకు నేపాల్ పోలీసులు విశాఖ సీపీ చొరవతో గాజువాక పోలీసుల సహాయంతో ఆమె ఆచూకీని కనుగొన్నారు. అనంతరం ఆమెను వారి తల్లిదండ్రులకు క్షేమంగా అప్పగించారు. ఈ విషయమై మంగళవారం నేపాల్ పోలీసులు విశాఖ సీపీ, పోలీసులను అభినందిస్తూ లేఖ రాశారు. మిస్సింగ్ కేసును ఛేదించిన గాజువాక పోలీసులను సీపీ అభినందించారు.

News April 23, 2025

విశాఖ జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా కేకే రాజు

image

విశాఖ జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా కేకే.రాజును నియమిస్తూ ఆ పార్టీ కేంద్ర కార్యాలయం మంగళవారం ప్రకటన విడుదల చేసింది. విశాఖ జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా ఉన్న గుడివాడ అమర్నాథ్‌ను అనకాపల్లి జిల్లా అధ్యక్షుడిగా నియమించారు. అయితే కేకే.రాజు విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి రెండుసార్లు వైసీపీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి చెందరు.

error: Content is protected !!