News March 1, 2025
అనకాపల్లి నూకాంబిక అమ్మవారి ఆలయం చరిత్ర ఇదే..!

అనకాపల్లి పట్టణం గవరపాలెం కొబ్బరి తోట ప్రాంతంలో 1450లో ఉత్తరాంధ్ర ఇలవేల్పు నూకాంబిక అమ్మవారి ఆలయాన్ని నిర్మించారు. 1611లో అనకాపల్లి ప్రాంతానికి రాజుగా నియమించబడిన అప్పలరాజు పాయకరావు ఈ ఆలయాన్ని పునరుద్ధరించారు. 1937లో దేవాదాయ శాఖ ఆలయాన్ని స్వాధీనం చేసుకుంది. అసిస్టెంట్ కమిషనర్ క్యాడర్లో దేవాలయానికి ఈఓగా వ్యవహరిస్తారు. ప్రతి ఏటా ఉగాది ముందు రోజు నుంచి నెలరోజుల పాటు జాతర జరుగుతుంది.
Similar News
News November 28, 2025
తిరుపతి: కల్తీ నెయ్యి కేసులో మరిన్ని అరెస్టులు..?

తిరుమల కల్తీ నెయ్యి కేసులో మరికొన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. డిసెంబర్ 15వ తేదీలోపు మూడో ఛార్జ్ షీట్ దాఖలు చేయనున్న నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికీ తప్పించుకుని తిరుగుతున్న కరీముల్లను సైతం 15వ తేదీలోపు అదుపులోకి తీసుకునే దిశగా సిట్ బృందాలు గాలింపు చేపట్టాయి.
News November 28, 2025
స్మృతితో పెళ్లిపై పలాశ్ తల్లి ఏమన్నారంటే..

స్మృతి మంధాన వివాహంపై సస్పెన్స్ కొనసాగుతున్న వేళ పలాశ్ ముచ్చల్ తల్లి అమృత స్పందించారు. త్వరలోనే పెళ్లి జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ‘ఆ రోజు జరిగిన పరిణామాలపై ఇద్దరూ బాధపడుతున్నారు. మ్యారేజ్ అవగానే స్మృతికి గ్రాండ్ వెల్కమ్ చెప్పడానికి ఏర్పాట్లు చేశాం. అనుకోని పరిస్థితులతో వివాహం వాయిదా వేశాం’ అని చెప్పారు. కాగా పెళ్లి సంబంధిత పోస్టులను స్మృతి డిలీట్ చేయడం చర్చనీయాంశమైన విషయం తెలిసిందే.
News November 28, 2025
కర్నూలు: మంటలు అంటుకొని బాలుడి మృతి…!

స్నానానికి వేడి నీరు తీసుకునే క్రమంలో ప్రమాదవశాత్తు మంటలు అంటుకుని పెద్దకడబూరుకు చెందిన వడ్డే ప్రవీణ్ కుమార్(6) మృతి చెందినట్లు ఎస్ఐ నిరంజన్ రెడ్డి తెలిపారు. ఈ నెల 11న ఘటన జరగగా చికిత్స నిమిత్తం ఆదోని ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. పరిస్థితికి విషమించడంతో కర్నూలులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం మృతి చెందినట్లు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేశామన్నారు.


