News February 10, 2025
అనకాపల్లి: నేటి నుంచి ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు

అనకాపల్లి జిల్లాలో సోమవారం నుంచి ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు ప్రారంభమవుతున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారిణి సుజాత తెలిపారు. జిల్లాలో 35 జూనియర్ కళాశాలలు, 4 మోడల్ కళాశాలల్లో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాల్లో ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. జిల్లాలో 13,969 మంది ప్రాక్టికల్ పరీక్షకు హాజరవుతారన్నారు. మూడు ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలను ఏర్పాటు చేశామన్నారు.
Similar News
News November 16, 2025
HYD: బిర్సా ముండా జయంతి సందర్భంగా ర్యాలీ

భగవాన్ బిర్సా ముండా జయంతి సందర్భంగా కేంద్ర మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి సావిత్రితో కలిసి ట్యాంక్ బండ్ వద్ద స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వివేకానంద విగ్రహం నుంచి కొమురం భీమ్ విగ్రహం వరకు ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆదివాసీల హక్కుల కోసం భగవాన్ బిర్సా ముండా చూపిన ధైర్యం ఎనలేనిదన్నారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పాల్గొన్నారు.

2028 నాటికి చంద్రయాన్-4 పూర్తి: నారాయణన్

ఈ ఆర్థిక సంవత్సరంలో మరో 7 ప్రయోగాలు చేయనున్నట్లు ఇస్రో ఛైర్మన్ నారాయణన్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. వీటిలో PSLV, గగన్యాన్ మిషన్లతోపాటు ఓ కమర్షియల్ శాటిలైట్ ప్రయోగమూ ఉందని చెప్పారు. ‘చంద్రయాన్-4కు కేంద్రం ఆమోదం తెలిపింది. 2028 నాటికి చంద్రుడి నుంచి మట్టి నమూనాలను తీసుకురావడమే దీని లక్ష్యం. 2035 నాటికి సొంత అంతరిక్ష కేంద్రం నిర్మాణాన్ని పూర్తిచేస్తాం’ అని వివరించారు.