News April 12, 2025

అనకాపల్లి: నేడే ఇంటర్ రిజల్ట్స్.. ఇలా చెక్ చేసుకోండి

image

ఇంటర్ ఫలితాల విడుదలకు సర్వం సిద్ధమైంది. ఈరోజు ఉదయం 11 గంటలకు ఫలితాలు విడుదల కానున్నాయి. అనకాపల్లి జిల్లాలో ఫస్టియర్ 12,936 మంది, సెకండియర్ 13,225 మంది విద్యార్థులు ఉన్నారు. ఒకప్పుడు రిజల్ట్స్ కోసం నెట్ సెంటర్ల చుట్టూ తిరిగేవారు. నేడు సెల్‌ఫోన్‌లోనే చూసుకుంటున్నారు. రిజల్ట్స్ వెతికేందుకు టెన్షన్ పడొద్దు.. వే2న్యూస్ యాప్‌లో ఈజీగా చెక్ చేసుకోవచ్చు.

Similar News

News October 30, 2025

నేటి నుంచి టెన్త్ పరీక్షల ఫీజు స్వీకరణ

image

TG: టెన్త్ పబ్లిక్ పరీక్షల ఫీజు స్వీకరణ ఇవాళ్టి నుంచి ప్రారంభం కానుంది. విద్యార్థులు నవంబర్ 13 వరకు స్కూళ్ల HMలకు డబ్బు చెల్లించాలి. రూ.50 ఆలస్య రుసుముతో నవంబర్ 29 వరకు, రూ.200తో డిసెంబర్ 11, రూ.500 ఎక్స్‌ట్రా ఫీజుతో డిసెంబర్ 19 వరకు చెల్లించవచ్చు. కాగా ఇంటర్ ఎగ్జామ్స్ ముగిసిన తర్వాత మార్చి మూడో వారంలో పది పరీక్షలు జరిగే అవకాశం ఉంది.

News October 30, 2025

HYD: 1987 నాటి రైలు ఎలా ఉండేదో తెలుసా?

image

1987 నాటి ఈ అందమైన ఫొటో నాటి రైల్వే వ్యవస్థను గుర్తుచేస్తోంది. సికింద్రాబాద్ స్టేషన్‌కి అకోలా జంక్షన్‌ నుంచి వచ్చిన ప్రయాణికులను YP 2865 లోకోమోటివ్‌ రైలు పొగలు కక్కుతూ, కూ.. అంటూ కూతవేస్తూ లాగేది. 1960ల చివర్లో టాటా కంపెనీ టెల్కో, జంషెడ్‌పూర్‌లో ఈ YP ఇంజిన్‌ తయారు చేసిందని IRAS అనంత్ తెలిపారు. తను ఉద్యోగంలో చేరిన సమయంలో రైల్వే అనుభూతులను గుర్తు చేసుకున్నారు.

News October 30, 2025

GNT: తొలగిన తుపాన్ ముప్పు.. సాధారణ స్థితికి జనజీవనం

image

తుపాను భయంతో కొద్ది రోజులుగా బిక్కు బిక్కు మంటూ ఇంటిపట్టునే కాలం గడిపిన జనం నెమ్మదిగా తేరుకుంటున్నారు. తుపాను తీరం దాటి ముప్పు తొలగిపోవడంతో రోజువారి కార్యక్రమాల్లో నిమగ్నమవుతున్నారు. వర్షం ముసురు తొలగి సూర్య భగవానుడి రాకతో ఊపిరి పీల్చుకొంటున్నారు. సెలవుల అనంతరం విద్యా సంస్థలు కూడా తెరవడంతో పిల్లలు బడిబాట పట్టారు. దాదాపు నాలుగు రోజుల తర్వాత వీధులన్నీ రద్దీగా మారి జనజీవనం సాధారణ స్థితికి వచ్చింది.