News January 31, 2025
అనకాపల్లి: పండగరోజు ఆ గ్రామంలో విషాదం

మాకవరపాలెం(M) లచ్చన్నపాలెంలో శుక్రవారం అదే గ్రామానికి చెందిన రొంగల సతీశ్(25) మృతి చెందాడు. RTCలో ప్రైవేట్ డ్రైవర్‌గా పనిచేస్తున్న సతీశ్ వేరే చోటకు బైక్‌పై వెళుతుండగా..ఎదురుగా వస్తున్న మరో బైక్‌ను తప్పించబోయి కరెంట్ పోల్‌ను ఢీకొట్టాడు. తలకు తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ దామోదరనాయుడు తెలిపారు. కాగా.. గ్రామంలో ఈరోజు గైరమ్మ ఉత్సవాలు జరుగుతున్నాయి.
Similar News
News February 19, 2025
VZM: పెండింగ్ చలానాలు చెల్లించాలి

పెండింగ్‌లో ఉన్న ఈ చలనాలను వాహనదారులు చెల్లించే విధంగా జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని పోలీస్ అధికారులను ఎస్పీ వకుల్ జిందల్ ఆదేశించారు. తన కార్యాలయంలో బుధవారం మాట్లాడుతూ.. నిబంధనలు అతిక్రమించిన వారిపై ఈ చలనాలు విధించినప్పటికీ చెల్లించడంలో వాహనదారులు నిర్లక్ష్యం వహిస్తున్నారన్నారు. ఈ చలానాలు చెల్లించే వరకు వాహనాలు సీజ్ చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
News February 19, 2025
రేపు కాగజ్ నగర్‌కు మంత్రి సీతక్క

రేపు ఉదయం 11 గంటలకు స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క కాగజ్‌నగర్‌లో పర్యటిస్తారని ఎమ్మెల్సీ దండే విఠల్ ఒక ప్రకటనలో తెలిపారు. త్వరలో రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ అభ్యర్థి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డిని గెలిపించేందుకు కృషి చేయాలని, ఈ సమావేశానికి పట్టభద్రులు, కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు తరలిరావాలని అన్నారు.
News February 19, 2025
HYD: ఆ ఫ్లాట్లు కొని ఇబ్బంది పడొద్దు!

అనుమతి లేని లే అవుట్లలో ప్లాట్లు కొని ఇబ్బందులు పడొద్దని హైడ్రా సూచించింది. HYD శివార్లలో ఫార్మ్ ప్లాట్ల పేరిట అమ్మకాలు జరుగుతున్నాయని, వీటిని కొన్నవారు తర్వాత ఇబ్బందులు పడాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఫార్మ్ ల్యాండ్ ప్లాట్ల రిజిస్ట్రేషన్లపై నిషేదం ఉన్నప్పటికీ, కొన్ని ప్రాంతాల్లో అమ్మకాలు జరుగుతున్నాయని హైడ్రాకు వచ్చిన ఫిర్యాదుల మేరకు తెలుస్తోందని కమిషనర్ రంగనాథ అన్నారు.