News March 24, 2025

అనకాపల్లి: పదవ తరగతి పరీక్షకు 202 మంది విద్యార్థులు గైర్హాజరు

image

అనకాపల్లి జిల్లాలో సోమవారం జరిగిన పదవ తరగతి గణితం పరీక్షకు 202 విద్యార్థులు గైర్హాజరు అయినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి అప్పారావు నాయుడు ఓ ప్రకటనలో తెలిపారు. జనరల్ విద్యార్థులు 20,774 మంది విద్యార్థులు హాజరు కావలసి ఉండగా 20,681 హాజరైనట్లు చెప్పారు. ఒకసారి ఫెయిల్ అయిన విద్యార్థులు 685 మంది హాజరు కావలసి ఉండగా 576 మంది హాజరైనట్లు తెలిపారు. పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయన్నారు.

Similar News

News November 8, 2025

యువతకు భద్రత కల్పించండి: SP

image

యువత భవిష్యత్తుకు భద్రత కల్పించాలని SP ధీరజ్ కునుబిల్లి శనివారం జిల్లా పోలీసులను ఆదేశించారు. ‘శక్తి’ టీమ్ బృందాలు జిల్లాలోని పలు పాఠశాలలు, కళాశాలల్లో వినూత్నంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. సోషల్ మీడియా దుర్వినియోగం, సైబర్ క్రైమ్, ఆన్‌లైన్ మోసాలు, వైట్ కాలర్ నేరాల నివారణపై విద్యార్థులకు పోలీసులు వివరించారు. తప్పుడు సమాచారం (ఫేక్ న్యూస్) షేర్ చేయడం వలన ఎదురయ్యే సమస్యల గురించి వివరించారు.

News November 8, 2025

బండి సంజయ్ హాట్ కామెంట్స్

image

TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘ఇది హిందూ, ముస్లింల మధ్య జరుగుతున్న వార్. మొలతాడు ఉన్నోళ్లకు, లేనోళ్లకు, బొట్టు పెట్టుకున్నోళ్లకు, పెట్టుకోనోళ్లకు మధ్య పోటీ. 80% ఉన్న హిందువులు గెలుస్తారా? 20% ఉన్న ముస్లింలా? హిందువుల పక్షాన BJP, ముస్లింల వైపు INC ఉంది. TGని ఇస్లామిక్ స్టేట్‌గా మార్చేందుకు రేవంత్ కుట్ర చేస్తున్నారు’ అని వ్యాఖ్యానించారు.

News November 8, 2025

నాగిరెడ్డిపేట: పురుగుల మందు సేవించి వృద్ధురాలి మృతి

image

నాగిరెడ్డిపేట మండలంలోని లింగంపల్లి కలన్ గ్రామానికి చెందిన రోడ్డ రత్నవ్వ (70) పురుగుల మందు సేవించి మృతి చెందినట్లు స్థానిక ఎస్సై భార్గవ్ గౌడ్ తెలిపారు. ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ, జీవితంపై విరక్తి చెంది రత్నవ్వ ఆత్మహత్యకు పాల్పడినట్లు ఆమె కుమార్తె రోడ్డ సాయవ్వ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.