News March 22, 2025

అనకాపల్లి: పదో తరగతి పరీక్షకు శతశాతం హాజరు

image

అనకాపల్లి జిల్లాలో శనివారం నిర్వహించిన పదో తరగతి సంస్కృత పరీక్షకు శత శాతం విద్యార్థులు హాజరైనట్లు జిల్లా విద్యాశాఖ అధికారి అప్పారావు నాయుడు తెలిపారు. రెగ్యులర్ విద్యార్థులు మొత్తం 951 మంది పరీక్షకు హాజరైనట్లు వివరించారు. పరీక్షల్లో ఎటువంటి మాస్ కాపీయింగ్‌కు అవకాశం లేకుండా పకడ్బందీగా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. 

Similar News

News April 20, 2025

మనుబోలు: పంట కాలువలోకి దూసుకెళ్లిన కారు

image

మనుబోలు మండలంలోని వడ్లపూడి వద్ద ఆదివారం కారు బోల్తా పడి అదుపుతప్పి పంట కాలువలోకి దూసుకెళ్లింది. ఆ సమయంలో కారులో ఐదుమంది ఉన్నారు. వీళ్లంతా సురక్షితంగా బయటపడ్డారు. పొదలకూరు మండలం బిరదవోలు రాజుపాలెంకు చెందిన వారు కొత్త కారును కొనుగోలు చేసి గొలగమూడిలో పూజలు చేయించుకొని తిరిగి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది.

News April 20, 2025

కృష్ణా: LLB పరీక్షల ఫలితాలు విడుదల

image

కృష్ణా యూనివర్శిటీ పరిధిలో ఇటీవల నిర్వహించిన LLB 3వ, 7వ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షల ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ రిజిస్టర్ నంబర్ ద్వారా రిజల్ట్స్ తెలుసుకోవచ్చు. పరీక్షల ఫలితాలకై అధికారిక వెబ్‌సైట్ https://kru.ac.in/ చెక్ చేసుకోవాలని KRU పరీక్షల విభాగం సూచించింది.

News April 20, 2025

కాబోయే భార్య వేధింపులు.. అధికారి సూసైడ్

image

కాబోయే భార్య వేధింపులు తాళలేక ఇన్‌కమ్ ట్యాక్స్ ఆఫీసర్ సూసైడ్ చేసుకున్న ఘటన MHలో జరిగింది. నాసిక్‌కు చెందిన హరేరామ్(36), వారణాసి యువతి మోహినికి ఎంగేజ్‌మెంట్ జరిగింది. మోహిని తన లవర్‌ను హగ్ చేసుకోవడం చూసి హరేరామ్ నిలదీశాడు. విషయం బయటకు చెబితే తనతో పాటు కుటుంబంపై వరకట్న వేధింపుల కేసు పెడతానని ఆమె బెదిరించింది. మానసిక ఒత్తిడికి లోనైన హరేరామ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. యువతి, ఆమె లవర్‌పై కేసు నమోదైంది.

error: Content is protected !!