News March 29, 2025
అనకాపల్లి: పబ్లిక్ గ్రీవియన్స్ రిడ్రసల్ సిస్టం రద్దు: ఎస్పీ

రంజాన్ పండగ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 31న శెలవు ప్రకటించినందున జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించాల్సిన పబ్లిక్ గ్రీవియన్స్ రిడ్రసల్ సిస్టంను రద్దు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా శనివారం తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అనకాపల్లి జిల్లా ప్రజలకు తెలుగు నూతన సంవత్సరం, రంజాన్ పండగ శుభాకాంక్షలు తెలిపారు.
Similar News
News November 23, 2025
చిత్తూరు జిల్లాలో చికెన్ ధరలు

చిత్తూరు జిల్లాలో ఆదివారం చికెన్ ధరలు ఇలా ఉన్నాయి. పలు దుకాణాల్లో బ్రాయిలర్ కోడి కిలో రూ.133 నుంచి రూ.140, మాంసం రూ.193 నుంచి 207 వరకు పలుకుతోంది. స్కిన్ లెస్ రూ.219 నుంచి రూ.232 వరకు విక్రయిస్తున్నారు. మరోవైపు కేజీ మటన్ రూ.800 నుంచి రూ. 900 మధ్య ఉంది. మీ ఏరియాలో మాంసం ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.
News November 23, 2025
భారీగా పెరుగుతున్న రెవెన్యూ లోటు

AP: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూ లోటు భారీగా పెరుగుతోంది. 2025-26లో రూ.33,185 కోట్ల రెవెన్యూ లోటు ఉంటుందని ప్రభుత్వం బడ్జెట్లో అంచనా వేస్తే, OCT నాటికే రూ.47,805 కోట్లకు చేరినట్లు కాగ్ తన నివేదికలో వెల్లడించింది. రెవెన్యూ ఆదాయం రూ.2.17 లక్షల కోట్లుగా అంచనా వేస్తే రూ.91,638 కోట్లు వచ్చాయి. ప్రస్తుత FYలో రూ.79,927 కోట్ల అప్పులు చేయాల్సి ఉండగా, 7 నెలల్లోనే రూ.67,283 కోట్ల రుణాలు తీసుకుంది.
News November 23, 2025
ఖమ్మం: రిజర్వేషన్లు కొలిక్కి.. నేడు గెజిట్ విడుదల?

ఖమ్మం జిల్లాలోని 571 గ్రామ పంచాయతీలు, 5214 వార్డుల రిజర్వేషన్ల ప్రక్రియ కొలిక్కి వచ్చింది. ఏజెన్సీలో 99 ఎస్టీ పంచాయతీలు ఉండగా, మైదాన ప్రాంతంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కలిపి 49 శాతం రిజర్వేషన్లు కేటాయించారు. ఈ కసరత్తు పూర్తవడంతో నేడు కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది. నవంబర్ 25 లేదా 26 నాటికి రాష్ట్ర నోటిఫికేషన్ వెలువడనుంది.


