News July 13, 2024
అనకాపల్లి: ‘పరిశ్రమలలో భద్రతా ప్రమాణాలను పాటించాలి’

అనకాపల్లి జిల్లాలో ఉన్న పరిశ్రమలలో పూర్తిస్థాయి భద్రతా ప్రమాణాలను అమలు చేయాలని కలెక్టర్ విజయకృష్ణన్ అన్నారు. శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్లో పారిశ్రామిక, ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ సమావేశం జరిగింది. కలెక్టర్ విజయకృష్ణన్ మాట్లాడుతూ.. వివిధ రకాల చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు జిల్లా యంత్రాంగం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని అన్నారు.
Similar News
News November 14, 2025
బీహార్ విజయంపై ఎన్డీయే నేతల సెలబ్రేషన్స్

బీహార్ ఎన్నికల్లో ఎన్డీయే ఘన విజయాన్ని పురస్కరించుకుని విశాఖలో సీఎం చంద్రబాబు కూటమి నేతలకు శుభాకాంక్షలు తెలిపారు. కేంద్ర మంత్రులు పియూష్ గోయల్, రామ్మోహన్ నాయుడు, శ్రీనివాస వర్మ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, కూటమి ఎంపీలు పరస్పరం స్వీట్లు తినిపించుకొని ఆనందం పంచుకున్నారు.
News November 14, 2025
మూడేళ్లలో విశాఖలో లూలూ మాల్

మూడేళ్లలో విశాఖలో ‘లూలూ’ మాల్ను పూర్తి చేయనున్నట్లు ఆ సంస్థ ఛైర్మన్ యూసఫ్ అలీ తెలిపారు. CII సమ్మిట్లో ఆయన మాట్లాడారు. 2018లో మాల్కు శంకుస్థాపన చేశామన్నారు. అయితే ప్రభుత్వం మారిన తర్వాత పలు కారణాలతో ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు చెప్పారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాజెక్ట్ మళ్లీ తెరపైకి వచ్చిందన్నారు. ఈ మాల్ ద్వారా ప్రత్యక్షంగా 5వేల మందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తామన్నారు.
News November 14, 2025
ఆల్పాహార విందులో పాల్గొన్న ఉపరాష్ట్రపతి

విశాఖపట్నంలో జరుగుతోన్న సీఐఐ భాగస్వామ్య సదస్సుకు వచ్చిన ఉపరాష్ట్రపతి సీ.పీ.రాధాకృష్ణన్.. సీఎం చంద్రబాబు ఇచ్చిన అల్పాహార విందులో పాల్గొన్నారు. వీరితో పాటుగవర్నర్ అబ్దుల్ నజీర్, కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి నారా లోకేశ్, ఇతర మంత్రులు, కలెక్టర్ హరేంధిర ప్రసాద్, సీపీ శంఖబ్రత బాగ్చీ ఉన్నారు.


