News February 17, 2025

అనకాపల్లి: పెళ్లి ఇంట్లో విషాదం

image

రాంబిల్లి మండలం దిమిలిలోని పెళ్లి ఇంట్లో విషాదం నెలకొంది. విజయనగరం(D) వేపాడ మండలానికి చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి జి.రవికుమార్ (25) దిమిలికి చెందిన తన చిన్నమామయ్య వివాహ వేడుకల్లో పాల్గొనేందుకు అన్నవరం వెళ్ళాడు. వివాహం అనంతరం ఆదివారం తిరిగి బైక్‌పై దిమిలి వస్తుండగా తునిలో జాతీయ రహదారిపై ఆగి ఉన్న వాహనాన్ని ఢీకొట్టాడు. రవికుమార్ అక్కడికక్కడే మృతిచెందగా వెనుక కూర్చున్న మరో మేనమామ తీవ్రంగా గాయపడ్డాడు.

Similar News

News November 16, 2025

వేములవాడ: ‘నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి’

image

మిడ్ మానేర్ బ్యాక్ వాటర్ ప్రభావిత పట్టా భూముల్లో పంటలు మునిగిపోవడంతో రైతులు తీవ్ర నష్టాన్ని ఎదుర్కొంటున్నారని వేములవాడ అర్బన్ మండల భారతీయ జనతా పార్టీ నాయకులు జిల్లా కలెక్టర్‌ కు వినతిపత్రం సమర్పించారు. వెంటనే అధికారులు పంట పొలాలను సందర్శించి రైతులకు న్యాయం చేయాలని, అలాగే ముంపు గ్రామాల పెండింగ్ సమస్యలను పరిష్కరించి నిర్వాసితులకు హామీ ఇచ్చిన ఐదు లక్షల నాలుగు వేల రూపాయలు విడుదల చేయాలని వారు కోరారు.

News November 16, 2025

KNR: SRR కళాశాలలో కార్తీక మాస వనభోజనాలు

image

స్థానిక SRR ప్రభుత్వ కళాశాలలోని వృక్షశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో కార్తీక మాస వనభోజనాలు నిర్వహించారు. కళాశాల ఆవరణలో ఉన్న ఔషధ మొక్కల ఉద్యానవనంలో ఉసిరి వృక్షంతో పాటుగా వివిధ ఔషధ మొక్కలను ఈ విద్యా సంవత్సరంలో ఈ ఉద్యానవనంలో ప్రవేశపెట్టి వాటిని సంరక్షిస్తున్న నేపథ్యంలో కార్తీక వనభోజనాలు ఏర్పాటు చేసినట్లు అధ్యాపకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో వృక్ష శాస్త్ర విభాగాధిపతి అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

News November 16, 2025

బిర్సా ముండా జయంతి.. సిరిసిల్లలో బీజేపీ నివాళులు

image

బిర్సా ముండా జయంతి సందర్భంగా బీజేపీ పట్టణ కమిటీ అత్యవసర సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించింది. గిరిజన హక్కుల కోసం పోరాడిన బిర్సా ముండా చిత్రపటానికి నాయకులు, కార్యకర్తలు నివాళులర్పించారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షుడు ధూమాల శ్రీకాంత్ మాట్లాడుతూ.. బిర్సా ముండా పోరాటం గిరిజన సమాజానికి దీపస్తంభం లాంటిదని, గిరిజన సంక్షేమం కోసం బీజేపీ కట్టుబడి ఉందని పేర్కొన్నారు. కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.