News February 17, 2025
అనకాపల్లి: పెళ్లి ఇంట్లో విషాదం

రాంబిల్లి మండలం దిమిలిలోని పెళ్లి ఇంట్లో విషాదం నెలకొంది. విజయనగరం(D) వేపాడ మండలానికి చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి జి.రవికుమార్ (25) దిమిలికి చెందిన తన చిన్నమామయ్య వివాహ వేడుకల్లో పాల్గొనేందుకు అన్నవరం వెళ్ళాడు. వివాహం అనంతరం ఆదివారం తిరిగి బైక్‌పై దిమిలి వస్తుండగా తునిలో జాతీయ రహదారిపై ఆగి ఉన్న వాహనాన్ని ఢీకొట్టాడు. రవికుమార్ అక్కడికక్కడే మృతిచెందగా వెనుక కూర్చున్న మరో మేనమామ తీవ్రంగా గాయపడ్డాడు.
Similar News
News March 16, 2025
BNGR: మండలానికి మరో రెండు రైతు నేస్తం కేంద్రాలు!

రైతులకు సాంకేతిక పరిజ్ఞానం అందించేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. అందులో భాగంగా రైతు నేస్తం కేంద్రాలను పెంచేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే ఉమ్మడి NLG జిల్లాలో 315 రైతు వేదికల్లో 77 రైతు నేస్తం కేంద్రాలని నిర్వహిస్తోంది. మండలానికి మరో రెండు కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. ప్రతినెల నిధులు మంజూరు చేసి రైతులకు మరింత పరిజ్ఞానం అందించనున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
News March 16, 2025
కరీంనగర్: వేర్వేరు ఘటనల్లో ఆరుగురి మృతి

KNR జిల్లాలో నిన్న వేర్వేరు ఘటనల్లో 6గురు చనిపోయారు. JMKTలో రైలుపట్టాల పక్కన ఓ యువజంట మృతదేహాలు లభ్యంకాగా, బిజిగిరిషరిఫ్‌లో రైలు ఎక్కే క్రమంలో ప్రమాదవశాత్తు జారిపడి <<15774781>>రైల్వే<<>> ఉద్యోగి కోమురయ్య మృతిచెందారు. KNRలోని ఓ లాడ్జీలో మానకొండురుకు చెందిన శివకుమార్ ఆత్మహత్య చేసుకోగా, KNR కొత్తపల్లిలో జరిగిన రోడ్డుప్రమాదంలో రేకుర్తికి చెందిన భూమయ్య(48) చనిపోయారు. మరో ప్రమాదంలో రామడుగుకు చెందిన సత్తయ్య చనిపోయారు.
News March 16, 2025
విజయవాడలో నేటి నెన్‌వెజ్ ధరలివే.!

విజయవాడలో చికెన్ ధరలు యథావిధిగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం స్కిన్‌లెస్ కిలో ధర రూ.180గా ఉండగా స్కిన్ రూ.170గా కొనసాగుతుంది. అలాగే కోడిగుడ్లు మాత్రం గత వారంతో పోలిస్తే పెరిగింది. గుడ్లు గత వారం రూ.138 ఉండగా నేడు రూ.144లకు పెరిగింది. ఇలాగే విజయవాడలో కేజీ రూ.180 ఉన్న చేపల ధర రూ.220లకు పెరిగింది. కేజీ మటన్ రూ.900లుగా కొనసాగుతోంది.