News February 27, 2025
అనకాపల్లి: పోలింగ్ సరళిని పరిశీలించిన కలెక్టర్

అనకాపల్లి కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్‌ను కలెక్టర్ విజయకృష్ణన్ సందర్శించారు. వెబ్ కాస్ట్ ద్వారా పోలింగ్ సరళని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా 24 పోలింగ్ కేంద్రాల్లో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక ప్రశాంతంగా జరుగుతుందన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు.
Similar News
News October 16, 2025
సంగారెడ్డి: ఒక్కరోజే 275 మద్యం దరఖాస్తులు

సంగారెడ్డి జిల్లాలో మద్యం దుకాణాల కోసం బుధవారం ఒక్కరోజు 275 దరఖాస్తులు వచ్చినట్లు ఎక్సైజ్ సూపరింటెండెంట్ నవీన్ చంద్ర తెలిపారు. ఇప్పటివరకు మొత్తం 778 దరఖాస్తులు వచ్చాయన్నారు. సంగారెడ్డి-153, పటాన్చెరు-511, జహీరాబాద్- 61, ఖేడ్- 26 ఆందోల్- 27 దరఖాస్తులు వచ్చినట్లు చెప్పారు. ఈనెల 18 వరకు కొత్త లైసెన్సుల కోసం దరఖాస్తుకు గడువు ఉందని పేర్కొన్నారు.
News October 16, 2025
నేడు ప్రధాని మోదీ పర్యటన.. స్కూళ్లకు సెలవులు

AP: ఉమ్మడి కర్నూలు జిల్లాలో నేడు PM మోదీ పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో కర్నూలు, నంద్యాల జిల్లాల్లోని స్కూళ్లకు ఇవాళ సెలవు ప్రకటించారు. మోదీ 9.55AMకు కర్నూలు చేరుకుంటారు. అక్కడ్నుంచి హెలికాప్టర్లో శ్రీశైలం వెళ్లి స్వామివారిని దర్శించుకుంటారు. శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శిస్తారు. ఉ.9 గం.-మ.2గం. వరకు శ్రీశైలంలో వాహన రాకపోకలపై ఆంక్షలు విధించారు. 2.20PMకు కర్నూలు చేరుకుని GST సభలో ప్రసంగిస్తారు.
News October 16, 2025
శ్రీశైల మల్లన్నను దర్శించుకోనున్న నాలుగో ప్రధాని మోదీ

AP: ప్రధాని మోదీ ఇవాళ శ్రీశైల మల్లన్నను దర్శించుకోనున్నారు. గతంలో ఆ హోదాలో జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ, పీవీ నరసింహారావు ఈ ఆలయాన్ని దర్శించుకున్నారు. ఇప్పుడు నాలుగో ప్రధానిగా మోదీ వస్తున్నారు. భారత వాయుసేన విమానంలో ఆయన ఢిల్లీ నుంచి బయలుదేరి ఉదయం 9.55 గంటలకు కర్నూలు, అక్కడి నుంచి సైనిక హెలికాప్టర్లో శ్రీశైలం వెళ్తారు. అటు మోదీకి స్వాగతం పలికేందుకు కర్నూలు నగరం ముస్తాబైంది.