News March 23, 2025

అనకాపల్లి: పోలీసుల దర్యాప్తులో అసలు నిజం

image

విశాఖలో 2021లో హత్యకు గురైన జి.శ్రీను కేసును రీ ఓపెన్ చేసిన పోలీసులు <<15855817>>మర్డర్ మిస్టరీని<<>> ఛేదించారు. జీ.శ్రీను తమ్ముడు తోటయ్య దొంగలించిన ఫోన్‌ను లాలం గణేశ్‌కు అమ్మాడు. దీనిని గణేశ్ తమ్ముడు వాడగా ట్రాక్ చేసిన పోలీసులు తోటయ్యను అరెస్ట్ చేశారు. బెయిల్ కోసం రూ.10,000 ఖర్చు అయిందని శ్రీను గణేశ్‌ను డబ్బులు అడిగే వాడు. దీంతో శ్రీను-గణేశ్‌ మధ్య వాగ్వాదం జరగ్గా.. అది హత్యకు దారి తీసినట్లు దర్యాప్తులో తేలింది.

Similar News

News November 24, 2025

నెల్లూరు విద్యార్థులకు ఎవరెస్ట్ ఎక్కే ఛాన్స్.!

image

జిల్లాలోని 52 మంది దివ్యాంగ విద్యార్థులకు అపురూప సాహస యాత్ర అవకాశం దక్కింది. సమగ్రశిక్ష అభియాన్ ఆధ్వర్యంలో చేపట్టిన ‘అడ్వెంచర్ స్పోర్ట్స్’కార్యక్రమానికి విద్యార్థులు ఎంపికయ్యారు. PMశ్రీ పాఠశాలలకు చెందిన విద్యార్థులు ప్రతిభ చూపితే ఎవరెస్ట్ బేస్ క్యాంప్ యాత్రకు ఎంపికవుతారు. ముందుగా వారు జోనల్ స్థాయి, రాష్ట్రస్థాయికి ఎంపిక కావాలి. అందుకోసం ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్లు అధికారులు తెలిపారు.

News November 24, 2025

శ్రీకాకుళం జిల్లాస్థాయి సంఘ సమావేశాల నిర్వహణ

image

శ్రీకాకుళం జిల్లా స్థాయి సంఘ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు జడ్పీ సీఈఓ సత్యనారాయణ తెలిపారు. సోమవారం జిల్లా కేంద్రం నుంచి ఆయన వివరాలు వెల్లడించారు. ఈ నెల 29న ఈ సమావేశాలు ఏర్పాటు చేశామన్నారు. వివిధ స్థాయి సంఘాల ప్రతినిధులతో పాటు అధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొంటారన్నారు. సమావేశాలకు అధికారులు పూర్తిస్థాయి సమాచారంతో పాల్గొనాలని ఆదేశించారు.

News November 24, 2025

గొల్లపల్లి: గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి, కలెక్టర్

image

గొల్లపల్లి మండల కేంద్రంలోని ఆవుల సాయవ్వకు మంజూరైన ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం పూర్తయ్యింది. సోమవారం జరిగిన గృహప్రవేశం కార్యక్రమానికి రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్ హాజరయ్యారు. పేదలకు సొంతింటి కల సాకారం చేయడం ప్రభుత్వ లక్ష్యమని మంత్రి అన్నారు. ప్రొసీడింగ్స్ పొందిన లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలని సూచించారు.