News May 7, 2025

అనకాపల్లి: పోలీస్ సిబ్బందికి సాధారణ బదిలీలు

image

అనకాపల్లి జిల్లా పోలీస్ శాఖలో సాధారణ బదిలీల ప్రక్రియను పూర్తి పారదర్శకతతో నిర్వహించామని ఎస్పీ తుహిన్ సిన్హా పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ.. ఒకే పోలీస్ స్టేషన్లో 5 సంవత్సరాలకు పైగా పనిచేస్తున్న 283 మందిని బదిలీ చేస్తున్నామన్నారు. వారిలో 161 మంది కానిస్టేబుల్స్ కాగా అందులో 57 మంది మహిళలు ఉన్నారు. హెడ్‌కానిస్టేబుల్స్ 95 మంది, 27 మంది ఏఎస్‌ఐల బదిలీకి ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిపారు.

Similar News

News April 14, 2026

పరమాత్ముడు ఒక్కడే.. ఈ సత్యాన్ని తెలుసుకోండి

image

కుండ కుంభ మండ్రు కొండ పర్వత మండ్రు
యుప్పు లవణ మండ్రు యొకటి గాదె?
భాషలింతె వేఱు పరతత్వమొకటే
విశ్వదాభిరామ! వినుర వేమ!!
తాత్పర్యం: కొన్ని పదాలకు ఒకే అర్థంలో పర్యాయపదాలుంటాయి. కుండను కుంభం, ఉప్పును లవణం, కొండను పర్వతం అంటారు. అలాగే దేశంలో కులాలు, మతాలు, భాషలు, సంస్కృతులు ఎన్ని ఉన్నా ఆ పరమాత్ముడు ఒక్కడే. ఈ సత్యాన్ని అందరూ తెలుసుకోవడం ముఖ్యం.
<<-se>>#PADHYAM<<>>

News April 14, 2026

మే తొలి వారంలో టెన్త్ ఫలితాలు!

image

TG: రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు నిన్నటితో ముగిశాయి. మే తొలి వారంలో ఫలితాలు రిలీజ్ చేసేందుకు SSC బోర్డు అధికారులు కసరత్తు ప్రారంభించారు. పరీక్షలు కొనసాగుతుండగానే సమాంతరంగా ఆన్సర్ షీట్ల వాల్యుయేషన్ నిర్వహించారు. ఇప్పటికే తెలుగు, హిందీ, ఇంగ్లిష్, మ్యాథ్స్ సబ్జెక్టుల మూల్యాంకనం పూర్తయినట్లు తెలుస్తోంది. సైన్స్, సోషల్ వాల్యుయేషన్, స్కానింగ్ ప్రక్రియ ఈ నెల 25 లోపు పూర్తి కానుందని సమాచారం.

News April 14, 2026

3 నెలలు తట్టుకోగలరా?.. అమెరికాకు ఇరాన్ కౌంటర్

image

హార్ముజ్ జలసంధిని అమెరికా బ్లాక్ చేయడంపై ఇరాన్ దీటుగా స్పందించింది. తమకు ఇబ్బందేం లేదని, 90 రోజులు ఎలాంటి ఆటంకం లేకుండా సప్లై చేయగలమని పేర్కొంది. ‘ఇరాన్‌ను దిగ్బంధిస్తానని ఆయన(ట్రంప్) బెదిరించాడు. 3 నెలలపాటు అమ్ముకోవడానికి సరిపడా చమురు నిల్వ మా ట్యాంకర్లలో ఉంది. మీరు, మీ మిత్రదేశాలు అన్ని రోజులు తట్టుకోగలరని మీకు నమ్మకముందా?’ అని బల్గేరియాలోని ఇరాన్ ఎంబసీ ప్రశ్నించింది.