News March 10, 2025
అనకాపల్లి: ప్రజా వేదికలో 440 అర్జీలు

ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో తమ దృష్టికి వచ్చిన సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తామని అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ అన్నారు. సోమవారం స్థానిక కలెక్టరేట్లో ప్రజావేదిక కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. వాటిని పరిశీలించిన ఆమె సత్వర పరిష్కారానికి సంబంధిత అధికారులకు పంపించారు. మొత్తం 440 అర్జీలు వచ్చినట్లు తెలిపారు.
Similar News
News December 18, 2025
పాలమూరు పంచాయతీ పోరు: కాంగ్రెస్ హవా

పాలమూరు జిల్లాలోని 5 జిల్లాల్లో ముగిసిన 3 విడతల పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ తన ఆధిక్యాన్ని చాటుకుంది. 77 మండలాలలోని 1,678 సర్పంచి స్థానాలకు గాను కాంగ్రెస్ మద్దతుదారులు అత్యధికంగా 964 చోట్ల విజయం సాధించారు. BRS బలపరిచిన అభ్యర్థులు 482స్థానాల్లో గెలవగా.. BJP 75 పీఠాలను దక్కించుకుంది. మరో 150చోట్ల స్వతంత్రులు, ఇతరులు విజేతలయ్యారు. మొత్తం 15,068 వార్డు స్థానాల్లోనూ కాంగ్రెస్ మద్దతుదారులే నెగ్గారు.
News December 18, 2025
‘బ్రహ్మపుత్ర’పై చైనా డ్యామ్.. భారత్కు ముప్పు!

యార్లంగ్ త్సాంగ్పో (బ్రహ్మపుత్ర) నదిపై $168B (సుమారు రూ.1,51,860CR)తో చైనా నిర్మిస్తున్న భారీ జలవిద్యుత్ ప్రాజెక్ట్ భారత్కు ఆందోళన కలిగిస్తోంది. ఈ నది కోట్లాది మందికి జీవనాధారంగా ఉంది. సుమారు 2KM ఎత్తును ఉపయోగించుకుని విద్యుత్ ఉత్పత్తి చేసే ఈ ప్రాజెక్ట్ వల్ల నది సహజ ప్రవాహం మారే ప్రమాదం ఉంది. దీంతో వ్యవసాయంపై ప్రభావం పడే అవకాశముంది. అలాగే భవిష్యత్తులో నీటిని ఆయుధంగానూ ఉపయోగించే ప్రమాదముంది.
News December 18, 2025
ఖమ్మం: మూడో దశ పోరులో పైచేయి ఎవరిదంటే?

● సత్తుపల్లి(21 స్థానాలు): CON- 16, BRS- 4, TDP- 1
● ఏన్కూర్(20): CON- 16, BRS- 3, ఇతరులు- 1
● తల్లాడ(27): CON- 19, BRS- 6, CPM- 1, ఇతరులు- 1
● కల్లూరు(23): CON- 8, BRS- 11, ఇతరులు- 4
● సింగరేణి(41): CON- 32, BRS- 2, CPI- 1, ఇతరులు- 6
● పెనుబల్లి(32): CON- 23, BRS- 8, ఇతరులు- 1
● వేంసూరు(26): CON- 15, BRS- 10, CPM- 1.


