News March 10, 2025

అనకాపల్లి: ప్రజా వేదికలో 440 అర్జీలు

image

ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో తమ దృష్టికి వచ్చిన సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తామని అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ అన్నారు. సోమవారం స్థానిక కలెక్టరేట్‌లో ప్రజావేదిక కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. వాటిని పరిశీలించిన ఆమె సత్వర పరిష్కారానికి సంబంధిత అధికారులకు పంపించారు. మొత్తం 440 అర్జీలు వచ్చినట్లు తెలిపారు.

Similar News

News July 8, 2025

నెల్లూరు రాజకీయాలకు మాయని మచ్చ..!

image

హుందాగా నడిచే నెల్లూరు రాజకీయాలు వ్యక్తిగత దూషణలకు వెళ్లాయి. పర్సంటేజీల ప్రసన్న, అప్పుల్లో పీహెచ్‌డీ చేసిన ప్రసన్న అంటూ ప్రశాంతి రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చే క్రమంలో ఆయన శ్రుతిమించారు. ‘ప్రశాంతి రెడ్డి చాలా చోట్ల PHdలు చేశారు. పీహెచ్‌డీలు అంటే మీరు అనుకునేవి కావు. వేమిరెడ్డిని బ్లాక్‌మెయిల్ చేసి పెళ్లి చేసుకుంది. ఆయనకు ప్రాణహాని ఉంది’ అని ప్రసన్న అన్నారు. ఈ ఇద్దరి వ్యాఖ్యలపై మీరేమంటారు?

News July 8, 2025

స్టేషన్‌ఘన్‌పూర్‌లో రూ.800 కోట్లు ‘రప్పా.. రప్పా’

image

స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గంలో వేలేరు మాజీ ఉపసర్పంచ్ సద్దాం హుస్సేన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రప్పా.. రప్పా డైలాగ్ హాట్ టాపిక్ అయింది. నియోజకవర్గ అభివృద్ధికి రప్పా.. రప్పా రూ.800 కోట్ల నిధులు తెచ్చిన ఎమ్మెల్యే కడియం శ్రీహరికి జన్మదిన శుభాకాంక్షలు అంటూ ఫ్లెక్సీలో పొందుపరిచారు. ఈ మధ్య ఈ డైలాగ్ తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమైన విషయం తెలిసిందే.

News July 8, 2025

క్రికెట్ ఇండోర్ స్టేడియంలో ఎందుకు ఆడరు?

image

క్రికెట్ పిచ్, ఔట్ ఫీల్డ్, భారీ సంఖ్యలో వచ్చే ప్రేక్షకులకు ఇండోర్ స్టేడియం సరిపోదు. పిచ్, బౌలింగ్‌లో స్వింగ్, సీమ్ వాతావరణ మార్పులను బట్టి మారుతూ ఉంటాయి. కొన్ని దేశాల్లో ఇండోర్ క్రికెట్ ఆడుతున్నారు. అయితే వాటి రూల్స్ భిన్నంగా ఉంటాయి. ICC మాత్రం అధికారికంగా ఇలాంటి మ్యాచ్‌లు నిర్వహించట్లేదు. పైకప్పును బంతి తాకితే దాన్ని ఎలా పరిగణించాలనే విషయంలో గందరగోళం కూడా దీనికి కారణం.