News April 7, 2025
అనకాపల్లి: ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 42 ఫిర్యాదులు

అనకాపల్లి జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో 42 ఫిర్యాదులు అందాయి. వీటిలో ఆస్తి తగదాలు, కుటుంబ కలహాలు, మోసపూరిత వ్యవహారాలపై ఫిర్యాదులు వచ్చాయని పోలీసులు తెలిపారు. ఎస్పీ తుహీన్ సిన్హా స్వయంగా దివ్యాంగుల వద్దకు వెళ్లి ఫిర్యాదులు స్వీకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమస్యలు పరిష్కారానికి చర్యలు తీసుకుంటానన్నారు.
Similar News
News April 17, 2025
మణికేశ్వరంలో విద్యుత్ షాక్‌తో యువకుడి మృతి

అద్దంకి మండలంలోని మణికేశ్వరం గ్రామంలో విద్యుత్ షాక్‌తో యువకుడు మృతి చెందిన ఘటన బుధవారం చోటుచేసుకొంది. స్థానికుల వివరాల మేరకు.. బీహార్ రాష్ట్రానికి చెందిన వికాస్ జాదవ్ (22) మణికేశ్వరంలో ఓ రైతు వద్ద కూలీగా పనిచేస్తున్నాడు. బుధవారం పశువుల చావిడిలో విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందాడు. ఘటనా స్థలాన్ని సీఐ సుబ్బరాజు, ఎస్ఐ ఖాదర్ బాషా పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వైద్యశాలకు తరలించారు.
News April 17, 2025
టెక్కలిలో ఓ వ్యక్తి సూసైడ్

టెక్కలి ఎన్టీఆర్ కాలనీ 7వ లైన్‌లో నివాసముంటున్న ముడిదాన కేశవరావు(38) అనే వ్యక్తి బుధవారం రాత్రి సూసైడ్ చేసుకున్నాడు. నందిగాం మండలం హుకుంపేటకు చెందిన ఈయన టెక్కలిలో ఉంటున్నాడు. ఇంట్లో ఎవరు లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. భార్య కొన్నేళ్ల క్రితం మృతిచెందగా కుమారుడు, కుమార్తె ఉన్నారు. మృతదేహాన్ని టెక్కలి పోలీసులు పరిశీలించారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
News April 17, 2025
మహబూబ్‌నగర్‌లో దారుణ ఘటన

ఆస్తి కోసం తండ్రి మృతదేహానికి కన్న కొడుకు తలకొరివి పెట్టకపోవడంతో చివరకు చిన్న కూతురు పెట్టింది. ఈ ఘటన MBNR పద్మావతి కాలనీలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. కాలనీ వాసి మాణిక్యరావు మృతిచెందారు. దహన సంస్కారాలకు ఏర్పాట్లు జరుగుతుండగా తలకొరివి పెట్టాల్సిన కుమారుడు రూ.కోటి విలువ చేసే ఇల్లు, 10 తులాల బంగారం ఇస్తేనే తలకొరివి పెడతానన్నాడు. చివరకు బంధువుల సూచనతో చిన్నకూతురు తలకొరివి పెట్టింది.