News April 3, 2025
అనకాపల్లి: ప్రభుత్వానికి 30.46 ఎకరాల భూమి అప్పగింత

ప్రభుత్వ భూముల్ని కాజేస్తున్న ఈరోజుల్లో సర్కారుకే తిరిగి భూముల్ని అప్పగించిన ఘటన అనకాపల్లి జిల్లా బుచ్చియ్యపేట(M) చిన భీమవరంలో చోటుచేసుకుంది. కూర్మన్నపాలేనికి చెందిన వ్యాపారవేత్త కడియాల రాజేశ్వరరావు గతంలో 30.46 ఎకరాల డిపట్టా భూములను కొనుగోలు చేశారు. గురువారం కలెక్టర్ విజయ్ కృష్ణన్ను కలిసి ఆ భూములపై సర్వహక్కులను వదులుకుంటున్నట్లు తెలిపారు. మార్కెట్ విలువ ప్రకారం ఆ భూముల విలువ సుమారు రూ.8కోట్లపైనే.
Similar News
News April 18, 2025
SKZR: సమ్మర్ స్పెషల్ ట్రైన్ గడువు పొడిగింపు

సమ్మర్ స్పెషల్ ట్రైన్ దానాపూర్ ఎక్స్ ప్రెస్ రైలు గడువును రైల్వే శాఖ మరో ఐదు రోజులు పొడిగించింది. స్పెషల్ ట్రైన్ ప్రస్తుత కాలపరిమితి ఈ నెల 17 వరకు ఉండగా.. 28 వరకు పొడిగిస్తూ రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. కాజీపేట్- బల్లార్షా సెక్షన్ పరిధిలోని కాజిపేట్, పెద్దపల్లి, బెల్లంపల్లి, సిర్పూర్ కాగజ్ నగర్, బల్లార్షా జంక్షన్లో ఈ రైలు ఆగుతుంది.
News April 18, 2025
ఢిల్లీ నుంచి ఏ శక్తీ తమిళనాడును పాలించలేదు: స్టాలిన్

కేంద్ర దర్యాప్తు సంస్థలతో దాడులు, పార్టీలను విచ్ఛిన్నం చేసే BJP వ్యూహాలు తమిళనాడులో పనిచేయవని CM స్టాలిన్ స్పష్టం చేశారు. ఆ పార్టీ కలిగించే అడ్డంకులను చట్టప్రకారం ఎదుర్కొంటామని చెప్పారు. ‘2026లోనూ తమిళనాడులో ద్రవిడ ప్రభుత్వమే వస్తుంది. ఢిల్లీ నుంచి ఏ శక్తీ మా రాష్ట్రాన్ని పాలించలేదు. వారికి తలవంచడానికి మేం బానిసలం కాదు. నేను బతికున్నంత వరకు ఇక్కడ ఢిల్లీ ప్రణాళికలు పనిచేయవు’ అని తేల్చిచెప్పారు.
News April 18, 2025
భూభారతి ద్వారా రైతులకు మేలు: భద్రాద్రి కలెక్టర్

భూభారతిని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. శుక్రవారం కరకగూడెం మండలంలోని జిల్లా పరిషత్ హై స్కూల్ నందు ఏర్పాటు చేసిన భూభారతి నూతన చట్టం అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం తీసుకొచ్చిన భూభారతి చట్టం ద్వారా రైతులకు మేలు జరుగుతుందని ఆయన అన్నారు. కార్యక్రమంలో తహశీల్దార్, ఎంపీడీవో, వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు.