News February 20, 2025
అనకాపల్లి: ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలి

అనకాపల్లి జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కలెక్టర్ విజయకృష్ణన్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో జాతీయ రహదారి భద్రత సమన్వయ కమిటీ జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద లైటింగ్ ఏర్పాటు చేయాలన్నారు. స్పీడ్ బ్రేకర్ల దగ్గర కలర్ పెయింటింగ్ వేయాలన్నారు. హెల్మెట్ వినియోగం తప్పనిసరి చేయాలన్నారు.
Similar News
News November 13, 2025
ECGC లిమిటెడ్లో 30 పోస్టులు

<
News November 13, 2025
మెదక్: భార్యను కత్తితో పొడిచి.. భర్త ఆత్మహత్య

మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణ పరిధి వెంకటాపూర్ (పిటి)కి చెందిన అంగడి శంకర్ (50) రాత్రి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. రెండు రోజులుగా మతిస్తిమితం కోల్పోయి ప్రవర్తిస్తున్నట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. నిన్న సోదరుడి మనుమరాలు భవనం పైనుంచి కింద పడేసినట్లు తెలిపారు. భార్యపై కత్తితో దాడి చేసినట్లు తెలిపారు. కుటుంబీకులు ఆసుపత్రికి వెళ్లగా ఇంటి వద్ద ఉన్న శంకర్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.
News November 13, 2025
ఖమ్మం: 208 స్కూళ్లకు 26 మందే..

విద్యార్థులు క్రీడల్లో రాణించడంలో పీఈటీల పాత్ర ఎంతో కీలకం. అయితే జిల్లాలో వారి కొరత తీవ్రగా వేధిస్తోంది. జిల్లాలోని 208 ఉన్నత పాఠశాలల్లో విద్యార్థులకు శిక్షణ ఇచ్చేందుకు కేవలం 11 మంది పీడీలు, 15 మంది పీఈటీలు మాత్రమే ఉన్నారు. అంటే మొత్తంగా 26 మందితోనే నెట్టుకొస్తున్నారు. శారీరక వికాసానికి క్రీడలు తప్పనిసరైనా తర్ఫీదు ఇచ్చేవారు లేకపోవడంతో ప్రతిభ ఉన్నా విద్యార్థులు స్వయంగా సిద్ధమవ్వాల్సి వస్తోంది.


