News October 23, 2024
అనకాపల్లి: ‘ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలి’

రైల్వే ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని రైల్వే స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్ సూచించారు. మంగళవారం ఢిల్లీ పార్లమెంట్ భవనంలో రైల్వే స్టాండింగ్ కమిటీ సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. 2024-25 సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ ఇతర అంశాలపై ఆయన సమీక్షించారు. రైల్వే వ్యవస్థ కార్యకలాపాల్లో భాగంగా భద్రతను పెంపొందించాలన్నారు.
Similar News
News December 10, 2025
ఎండాడ జాతీయ రహదారిపై బస్సు ఢీకొని జింక మృతి

ఎండాడ జాతీయ రహదారిపై బస్సు ఢీకొని జింక మృతి చెందింది. కంబాలకొండ నుంచి జింకలు తరచుగా రోడ్డుపైకి వస్తుంటాయి. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం జింక రోడ్డుపైకి ఆకస్మికంగా రావడంతో, అటుగా వస్తున్న బస్సు ఢీకొంది. జింక అక్కడికక్కడే మృతి చెందింది. కంబాలకొండ అడవి నుంచి ఇలా రోడ్డెక్కిన జింకలు తరచుగా ప్రమాదాలకు గురై, తీవ్ర గాయాలు లేదా మరణం సంభవిస్తున్నాయి. మృతదేహాన్ని అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
News December 10, 2025
విశాఖలో నేటి నుంచి ఎక్కడికక్కడ పనులు బంద్

జీవీఎంసీ పరిధిలో కాంట్రాక్టర్లు బుధవారం నుంచి పనులు నిలిపివేయడానికి నిర్ణయం తీసుకున్నారు.18 నెలలు నుంచి కాంట్రాక్టర్లకు రూ.400 కోట్ల బకాయిలు ఉండగా బిల్లులు చెల్లించాలని పలు దఫాలుగా వినతులు ఇచ్చారు. మంగళవారం కమిషనర్కు నోటీసులు కూడా అందజేశారు. స్పందించకపోవడంతో నేటి నుంచి యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో అన్ని ప్రాంతాల్లోనూ కాంట్రాక్టర్లు పనులు నిలిపివేసేలా చర్యలు తీసుకున్నారు.
News December 10, 2025
14న విశాఖ తీరంలో నేవీ మారథాన్

విశాఖలో ఈనెల 14న ఈస్ట్రన్ నేవల్ కమాండ్ ఆధ్వర్యంలో 10వ ఎడిషన్ నేవీ మారథాన్ జరగనుందని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ మంగళవారం తెలిపారు. ఆర్కేబీచ్ నుంచి ప్రారంభమయ్యే ఈ పోటీల్లో 17 దేశాల నుంచి 17,500 మంది పాల్గొంటున్నారు. 42, 21, 10, 5 కిలోమీటర్ల విభాగాల్లో ఈ పరుగు కొనసాగుతుంది. ఏర్పాట్లు పక్కాగా చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.


