News February 17, 2025
అనకాపల్లి: ప్రాక్టికల్ పరీక్షలకు 106 మంది గైర్హాజరు

అనకాపల్లి జిల్లాలో ఆదివారం జరిగిన ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలకు 106 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు ఇంటర్ బోర్డ్ జిల్లా అధికారిణి సుజాత తెలిపారు. ఉదయం జరిగిన పరీక్షకు 2313 మంది, మధ్యాహ్నం జరిగిన పరీక్షకు 2015 మంది హాజరైనట్లు పేర్కొన్నారు. పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయన్నారు.
Similar News
News December 10, 2025
రేపటి నుంచి భవానీ దీక్షల విరమణ

AP: విజయవాడ ఇంద్రకీలాద్రిపై రేపటి నుంచి ప్రారంభంకానున్న భవానీ మండల దీక్ష విరమణకు విస్తృత ఏర్పాట్లు చేశారు. ఈ నెల 15 వరకు కొనసాగనున్న ఈ కార్యక్రమానికి 7 లక్షల మంది భవానీలు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. గిరి ప్రదక్షిణ కోసం 9 కి.మీ. మార్గాన్ని ప్రత్యేకంగా సిద్ధం చేశారు. భవానీల కోసం 3 హోమగుండాలు, నిత్య అన్నదానం, రైల్వే స్టేషన్- బస్ స్టాండ్ల నుంచి బస్సులు ఏర్పాటు చేశారు.
News December 10, 2025
మరోసారి బలమైన ఆర్థిక వ్యవస్థను నిర్మిస్తా: ట్రంప్

అధ్యక్షుడిగా తన తొలి టర్మ్లో US ఆర్థిక వ్యవస్థను ప్రపంచంలోనే బలమైనదిగా నిలిపానని ట్రంప్ అన్నారు. ఈసారి మరింత పెద్దగా, గతంలో ఎన్నడూ చూడని దృఢమైన వ్యవస్థను నిర్మిస్తానని చెప్పారు. దీని కోసం చాలా శ్రమించాల్సి ఉందన్నారు. ఆర్థిక వ్యవస్థకు తోడ్పడకపోతే దేశ పౌరులుగా ఉండాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. తాను అధికారంలోకి రాకముందు కొత్త ఉద్యోగాలన్నీ వలసదారులకు వెళ్లేవని, ఇప్పుడు ఆ పరిస్థితి మారిందన్నారు.
News December 10, 2025
రాంబిల్లి: విద్యార్థుల ఆచూకీ కోసం పోలీసు బృందాలు గాలింపు

రాంబిల్లి మండలం హరిపురం బీసీటీ రెసిడెన్షియల్ స్కూల్ నుంచి మంగళవారం మధ్యాహ్నం అదృశ్యమైన ఆరుగురు విద్యార్థుల కోసం నాలుగు పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు వద్ద వీరి కోసం పోలీసు బృందాలు ఆరా తీస్తున్నాయి. పదవ తరగతి చదువుతున్న జస్వంత్, హిమతేజ, భరత్, లక్ష్మణరావు, వరుణ్, రాజారావు చెట్టు ఎక్కి గోడ దూకి పారిపోయారు. సరిగా చదవడం లేదని ఉపాధ్యాయులు వీరిని మందలించినట్లు తెలుస్తోంది.


