News February 17, 2025
అనకాపల్లి: ప్రాక్టికల్ పరీక్షలకు 106 మంది గైర్హాజరు

అనకాపల్లి జిల్లాలో ఆదివారం జరిగిన ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలకు 106 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు ఇంటర్ బోర్డ్ జిల్లా అధికారిణి సుజాత తెలిపారు. ఉదయం జరిగిన పరీక్షకు 2313 మంది, మధ్యాహ్నం జరిగిన పరీక్షకు 2015 మంది హాజరైనట్లు పేర్కొన్నారు. పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయన్నారు.
Similar News
News April 14, 2026
తాండూరులో కలగానే ‘కంది బోర్డు’

తాండూరులో కంది బోర్డు కలగానే మిగిలిపోయింది. తాండూరు, పెద్దేముల్, యాలాల్, బషీరాబాద్ మండలాల్లో సుమారు 2 లక్షల ఎకరాల్లో రైతులు కంది పంటను సాగు చేస్తున్నారు. కంది బోర్డును ఏర్పాటు చేస్తే రైతులకు నేరుగా విత్తనాలు, సబ్సిడీలు, మంచి మార్కెట్ ధర లభిస్తుంది. కంది బోర్డు ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు ఉన్నప్పటికీ కార్యరూపం దాల్చడం లేదు. కొంతకాలంగా కంది బోర్డును ఏర్పాటు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
News April 14, 2026
ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్?

Jr.NTR బర్త్‌డే సందర్భంగా మే 20న ఆయన సినిమాలకు సంబంధించి రెండు స్పెషల్ అప్‌డేట్స్ రానున్నట్లు తెలుస్తోంది. ప్రశాంత్ నీల్‌తో చేస్తున్న ‘డ్రాగన్’ మూవీ నుంచి టీజర్ వస్తుందని సినీ వర్గాలు తెలిపాయి. అలాగే త్రివిక్రమ్ దర్శకత్వంలో చేయబోయే ‘గాడ్ ఆఫ్ వార్’ మూవీపై అఫీషియల్ ప్రకటన, స్పెషల్ పోస్టర్ రానున్నట్లు పేర్కొన్నాయి. అదే రోజున ‘దేవర-2’పైనా మేకర్స్ నుంచి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
News April 14, 2026
CSKతో మ్యాచ్.. టాస్ గెలిచిన KKR

IPL 2026: చెన్నైతో జరగనున్న మ్యాచులో KKR టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. చెన్నైలోని చిదంబరం స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది.
CSK: శాంసన్, గైక్వాడ్, ఆయుష్ మాత్రే, సర్ఫరాజ్, శివమ్ దూబే, బ్రెవిస్, ఓవర్టన్, నూర్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్, గుర్జప్నీత్ సింగ్, ఖలీల్ అహ్మద్.
KKR: రహానె, గ్రీన్, రఘువంశీ, పావెల్, రింకూ సింగ్, అనుకుల్ రాయ్, నరైన్, రమణ్‌దీప్, వరుణ్ చక్రవర్తి, వైభవ్ అరోరా, కార్తీక్ త్యాగి.


