News January 30, 2025

అనకాపల్లి: ప్రేమ వివాహం.. బాలికతో వ్యభిచారం

image

అనకాపల్లి జిల్లాకు చెందిన బాలిక ప్రేమ వివాహం పేరుతో మోసపోయింది. పెద్దాపురం DSP వివరాల ప్రకారం.. ఎస్.రాయవరం మండలానికి చందిన 17 ఏళ్ల బాలిక కాకినాడ జిల్లా పెద్దాపురానికి చెందిన వ్యక్తిని లవ్ మ్యారేజ్ చేసుకుంది. భర్త, అత్త కలిసి బాలికకు డ్రగ్స్ ఇచ్చి బలవంతంగా వ్యభిచార కూపంలోకి దించి టార్చర్ చేశారు. దీంతో బాలిక ఆత్మహత్యాయత్నం చేసుకుంది. బాధితురాలి తల్లి ఈనెల 25న ఫిర్యాదు చేయగా ఈఘటన వెలుగులోకి వచ్చింది.

Similar News

News December 9, 2025

ఎయిర్‌పోర్టుల్లో తనిఖీలకు రామ్మోహన్ నాయుడు ఆదేశాలు

image

దేశంలోని మేజర్ ఎయిర్‌పోర్టుల్లో తనిఖీలు చేసి ఎయిర్‌లైన్ ఫంక్షనింగ్, ప్రయాణికుల సమస్యలు తెలుసుకోవాలని అధికారులను సివిల్ ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు ఆదేశించారు. ప్రయాణికులతో నేరుగా మాట్లాడి సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించాలని చెప్పారు. డిప్యూటీ సెక్రటరీ, డైరెక్టర్, జాయింట్ సెక్రటరీ స్థాయి అధికారులు హైదరాబాద్, ముంబై, బెంగళూరు, చెన్నై సహా మేజర్ ఎయిర్‌పోర్టుల్లో తనిఖీలు నిర్వహించనున్నారు.

News December 9, 2025

జగిత్యాల: నేటితో ప్రచారానికి తెర.. ప్రలోభాలకు ఎర..!

image

జగిత్యాల జిల్లాలో మొదటి విడత ఎన్నికలు జరగనున్న మండలాలలో నేటి సాయంత్రంతో ప్రచారానికి తెర పడనుంది. ఈ నేపథ్యంలో సర్పంచ్, వార్డ్ సభ్యుల స్థానాలకు పోటీ చేసేవారు ప్రలోభాలకు తెరలేపే అవకాశం ఉంది. ఇప్పటికే మందు, విందులతో జోరుగా దావతులు జరుగుతున్నాయి. ఓటర్లను ప్రలోభాలకు గురిచేయడానికి పలువురు అభ్యర్థులు ఆల్రెడీ అన్ని ఏర్పాట్లు చేసుకున్నారని గ్రామాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.

News December 9, 2025

విజయ్‌ సభకు తుపాకీతో వచ్చిన వ్యక్తి!

image

కరూర్ తొక్కిసలాట తర్వాత TVK చీఫ్‌, నటుడు విజయ్ తొలిసారి ప్రజల మధ్యకు వస్తున్నారు. నేడు పుదుచ్చేరిలో బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో ఉప్పాలంలోని ఎక్స్‌పో గ్రౌండ్‌లో అధికారులు భద్రతా పరంగా భారీ ఏర్పాట్లు చేశారు. అయితే ఓ వ్యక్తి తుపాకీతో ప్రవేశించేందుకు యత్నిస్తూ పోలీసుల తనిఖీల్లో పట్టుబడ్డాడు. అతడు శివగంగై జిల్లా టీవీకే కార్యదర్శి ప్రభుకు గార్డుగా పనిచేసే డేవిడ్‌గా గుర్తించారు.