News July 7, 2024
అనకాపల్లి: బాలికపై కక్ష కట్టి హత్య..!

రాంబిల్లి(మ) కొప్పుగుండుపాలేనికి చెందిన B.దర్శిని(14)హత్య కేసులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. కశింకోటకు చెందిన బి.సురేశ్(26) కొప్పుగుండుపాలెంలో అమ్మమ్మ ఇంట్లో ఉంటున్నాడు. ఏడాదిగా బాలిక వెంటపడడంతో ఆమె తల్లిదండ్రులతో కలిసి పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు అతనిపై పోక్సో కేసుపెట్టి జైలుకు పంపారు. దీంతో బాలికపై కక్ష పెంచుకున్న నిందితుడు బెయిల్పై వచ్చి ఆమెను హత్య చేసినట్లు తెలుస్తోంది.
Similar News
News November 19, 2025
విశాఖలో 21 చోట్ల వీధివిక్రయాలకు ఏర్పాట్లు: కమిషనర్

నగరంలో 21 స్మార్ట్ వెడ్డింగ్ జోన్లు ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నామని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ తెలిపారు. ఎండాడ, సెంట్రల్ పార్క్ వద్ద వీధి విక్రయదారులకు ఏర్పాటు చేస్తున్న వెండింగ్ స్థలాలను పరిశీలించారు. పిపిపి పద్ధతిలో ఏర్పాటు చేస్తున్నామని, అన్ని సదుపాయాలు కల్పించనున్నట్లు కమిషనర్ వివరించారు. జోనల్ కమిషనర్ కనకమహాలక్ష్మి, మల్లయ్య నాయుడు తదితరులు పాల్గొన్నారు.
News November 19, 2025
మామిడిలోవ హైవేపై యాక్సిడెంట్.. మహిళ మృతి

ఆనందపురం మండలం మామిడిలోవలో బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. హైవే వద్ద నిలిచి ఉన్న లారీని కూరగాయలతో వెళ్తున్న ఆటో ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. తీవ్రంగా గాయపడిన ఆటో డ్రైవర్ను ఆస్పత్రికి తరలించారు.