News January 28, 2025

అనకాపల్లి బెల్లం విక్రయాలు.. ఇదే తొలిసారి..!

image

అనకాపల్లి ఎన్టీఆర్ మార్కెట్ యార్డులో సోమవారం రికార్డు స్థాయిలో బెల్లం విక్రయాలు జరిగాయి. పలు గ్రామాల నుంచి రైతులు రూ.15,776 బెల్లం దిమ్మలను మార్కెట్టుకు తీసుకువచ్చి విక్రయించారు. ఈ సీజన్‌లో భారీ స్థాయిలో బెల్లం విక్రయాలు జరగడం ఇదే తొలిసారి అని మార్కెట్ అధికారులు తెలిపారు. అయితే బెల్లానికి డిమాండ్ లేకపోవడంతో ధరలు బాగా తగ్గాయని అధికారులు పేర్కొన్నారు.

Similar News

News February 24, 2026

జడ్చర్ల: గొల్లపల్లి చెరువులో మరో యువకుడి మృతదేహం లభ్యం!

image

జడ్చర్ల మండలం గొల్లపల్లి చెరువులో గల్లంతైన రెండో యువకుడు యాదగిరి మృతదేహాన్ని ఎస్డీఆర్ఎఫ్ (SDRF) బృందాలు మంగళవారం వెలికితీశాయి. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలంలో డీఎస్పీ వెంకటేశ్వర్లు, సీఐ కమలాకర్ భద్రతను పర్యవేక్షించగా, ఎస్సై జయప్రసాద్ గాలింపు చర్యల్లో పాల్గొన్నారు. దీంతో ఇద్దరు యువకుల గాలింపు ముగిసింది.

News February 24, 2026

పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలి: సీఎస్

image

పదవ తరగతి ఇంటర్మీడియట్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని సీఎస్ రామకృష్ణారావు జిల్లా అధికారులకు సూచించారు. సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో మహబూబాబాద్ జిల్లా ఎస్పీ శబరీష్, కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్‌తో పాటు పలువురు అధికారులతో మాట్లాడారు. విద్యార్థుల పరీక్షలు, పీఎం శ్రీ పాఠశాలలు, సమగ్ర శిక్ష అభియాన్ అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు.

News February 24, 2026

సిద్దిపేట జిల్లాలో పరిశ్రమల స్థాపనే లక్ష్యం: కలెక్టర్

image

సిద్దిపేట జిల్లాలో యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపరచడానికి పరిశ్రమల స్థాపన ఎంతో కీలకమని కలెక్టర్ కె. హైమావతి పేర్కొన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన జిల్లా పారిశ్రామిక ప్రోత్సాహక కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడారు. టీజీ-ఐపాస్ ద్వారా పరిశ్రమల నెలకొల్పడానికి వచ్చిన దరఖాస్తులపై ఆయా శాఖల అధికారులు త్వరితగతిన విచారణ పూర్తి చేసి, అనుమతులు మంజూరు చేయాలని ఆమె ఆదేశించారు.