News January 28, 2025

అనకాపల్లి బెల్లం విక్రయాలు.. ఇదే తొలిసారి..!

image

అనకాపల్లి ఎన్టీఆర్ మార్కెట్ యార్డులో సోమవారం రికార్డు స్థాయిలో బెల్లం విక్రయాలు జరిగాయి. పలు గ్రామాల నుంచి రైతులు రూ.15,776 బెల్లం దిమ్మలను మార్కెట్టుకు తీసుకువచ్చి విక్రయించారు. ఈ సీజన్‌లో భారీ స్థాయిలో బెల్లం విక్రయాలు జరగడం ఇదే తొలిసారి అని మార్కెట్ అధికారులు తెలిపారు. అయితే బెల్లానికి డిమాండ్ లేకపోవడంతో ధరలు బాగా తగ్గాయని అధికారులు పేర్కొన్నారు.

Similar News

News February 10, 2025

రేషన్ కార్డులు, పెన్షన్లకు దరఖాస్తు చేసుకోండి: మంత్రి

image

అర్హులైన ప్రతిఒక్కరు నూతన రేషన్ కార్డులకు, పెన్షన్లకు పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతొక్కరు ఆయాగ్రామల్లో సచివాలయల్లో దరఖాస్తు చేసుకోవాలని మంత్రి స్వామి తెలిపారు. సంబంధిత అధికారులు దరఖాస్తులను పరిశీలించి అర్హులను ఎంపిక చేయటం జరుగుతుందన్నారు. ప్రజలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చుతామన్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉందన్నారు.

News February 10, 2025

బ్యాటింగ్ ఎంజాయ్ చేశా.. సెంచరీపై రోహిత్ కామెంట్

image

ఇంగ్లండ్‌తో రెండో వన్డేలో సెంచరీ చేసి జట్టు కోసం నిలబడటం సంతోషాన్నిచ్చిందని కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపారు. మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ తన బ్యాటింగ్ ఎంజాయ్ చేశానని చెప్పారు. బ్యాటింగ్‌కు దిగినప్పుడే వీలైనన్ని ఎక్కువ రన్స్ చేయాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. తన బాడీని లక్ష్యంగా చేసుకొని వేసిన బంతులపై సరైన ప్రణాళికలు అమలు చేశానని పేర్కొన్నారు. ఇక గిల్ చాలా క్లాసీ ప్లేయర్ అని రోహిత్ కితాబిచ్చారు.

News February 10, 2025

నేడు ‘ఏరో ఇండియా షో 2025’ ప్రారంభం

image

భారత రక్షణశాఖ నేటి నుంచి ఈనెల 14 వరకు ‘ఏరో ఇండియా షో 2025’ను నిర్వహించనుంది. బెంగళూరుకు సమీపంలోని యెలహంకలో ఎయిర్ ఫోర్స్ స్టేషన్‌లో జరగనున్న ఈ షోను కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రారంభించనున్నారు. SU-57, F-35 యుద్ధ విమానాలు ఈ షోలో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. 150 విదేశీ సంస్థలతో సహా మొత్తం 900 ఎగ్జిబిటర్లతో అతిపెద్ద ఏరో ఈవెంట్‌గా ఇది నిలవనుంది. 43 దేశాలకు చెందిన ప్రతినిధులు హాజరుకానున్నారు.

error: Content is protected !!