News April 13, 2025
అనకాపల్లి: ‘బ్యాంకు లావాదేవీల నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలి’

బ్యాంకు లావాదేవీల నిర్వహణలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహీన్ సిన్హా శనివారం హెచ్చరించారు. UPI పిన్, OTPని బ్యాంకు వారితో కాకుండా ఎవరితోనూ షేర్ చేయవద్దన్నారు. బ్యాంకు వివరాలు ఇతరులకు చెప్పేముందు ఒక్కసారి ఆలోచించాలని సూచించారు. సైబర్ మోసాలకు గురైతే వెంటనే 1930కి ఫిర్యాదు చేయాలన్నారు.
Similar News
News November 27, 2025
అనంతపురం జిల్లాలో దారుణం

అనంతపురం శారదానగర్లో గురువారం దారుణం చోటు చేసుకుంది. రామగిరి డిప్యూటీ తహశీల్దార్ భార్య అమూల్య తన 3 ఏళ్ల కుమారుడు సహస్రను గొంతు కోసి, తాను ఉరి వేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. అయితే గత కొద్ది రోజుల క్రితం ఇరువురు ఘర్షణ పడినట్లు తెలుస్తోంది. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News November 27, 2025
కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు

AP: దిత్వా తుఫాను ప్రభావంతో రేపు GNT, బాపట్ల, ప్రకాశం, NLR, ATP, సత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, TPT జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశమున్నట్లు APSDMA తెలిపింది. ‘శనివారం అన్నమయ్య, చిత్తూరు, TPT జిల్లాల్లో అతిభారీ వర్షాలు, మిగిలిన జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముంది. ఆదివారం ప్రకాశం, నెల్లూరు, కడప, అన్నమయ్య, చిత్తూరు, TPT జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే ఛాన్సుంది’ అని పేర్కొంది.
News November 27, 2025
సిరిసిల్ల: ‘ఎన్నికల ప్రవర్తన నియమావళి పాటించాలి’

ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఎన్నికల ప్రవర్తన నియమావళి పాటించాలని సిరిసిల్ల ఎస్పీ మహేష్ బి గీతే అన్నారు. సిరిసిల్లలోని ఎస్పీ కార్యాలయంలో పోలీస్ అధికారులతో గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికలను శాంతియుత ప్రశాంత వాతావరణంలో ఎలాంటి అవాంఛనీయా ఘటనలు జరగకుండా నిర్వహించేందుకు తగు చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు.


