News April 13, 2025

అనకాపల్లి: ‘బ్యాంకు లావాదేవీల నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలి’

image

బ్యాంకు లావాదేవీల నిర్వహణలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహీన్ సిన్హా శనివారం హెచ్చరించారు. UPI పిన్, OTPని బ్యాంకు వారితో కాకుండా ఎవరితోనూ షేర్ చేయవద్దన్నారు. బ్యాంకు వివరాలు ఇతరులకు చెప్పేముందు ఒక్కసారి ఆలోచించాలని సూచించారు. సైబర్ మోసాలకు గురైతే వెంటనే 1930కి ఫిర్యాదు చేయాలన్నారు.

Similar News

News February 9, 2026

ఏర్పేడు: రీసెర్చ్ అసోసియేట్ పోస్టుకు దరఖాస్తులు

image

ఏర్పేడు వద్ద ఉన్న ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (IISER) తిరుపతిలో రీసెర్చ్ అసోసియేట్ (RA-01) పోస్టుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కార్యాలయం పేర్కొంది. Ph.D డిగ్రీ ఇన్ కెమికల్ సైన్స్ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులన్నారు. ఇతర వివరాలకు https://www.iisertirupati.ac.in/jobs/advt_102026/ వెబ్ సైట్ చూడాలని సూచించారు. దరఖాస్తులకు చివరి తేదీ ఫిబ్రవరి 16.

News February 9, 2026

తిరుపతి: విచారణ కమిటీ నివేదిక చేరిందా..?

image

రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై మహిళ ఆరోపణలు పెను దుమారం రేపింది. బాధితురాలు రోజుకో వీడియో విడుదల చేస్తోంది. కాగా ఆమె తాజాగా పవన్ కళ్యాణ్‌ను కలవాలంటూ వీడియో విడుదల చేసింది. జనసేన పార్టీ వేసిన విచారణ కమిటీ విచారణ చేసి వారం గుడుస్తున్నా ఇంతవరకు దానిపై ఎలాంటి ప్రకటన లేదు. కమిటీ నివేదిక ఇచ్చిందా లేదా? ఎమ్మెల్యే పై చర్యలు ఉంటాయా? అన్న చర్చ నడుస్తోంది.

News February 9, 2026

క్లీనింగ్ టిప్స్..

image

* వంటింటి అరల్లో బేకింగ్ సోడాని నీళ్ళలో కలిపి సీసాలో వేసి మూలల్లో స్ప్రే చేస్తే దుర్వాసనల సమస్య తగ్గుతుంది. * బాత్‌రూం షవర్ రంధ్రాలు మూసుకుపోతే… దానిని వైట్ వెనిగర్‌తో శుభ్రం చేయాలి. * ఫర్నిచర్‌కు చెదలు పట్టకుండా ఉండాలంటే… కర్పూరం పొడి, లిక్విడ్ పారాఫిన్ సమపాళ్ళలో కలిపి వాటిని తుడిస్తే సమస్య తగ్గుతుంది. * ఫ్రిజ్ లోపల దుర్వాసన వస్తోంటే వంటసోడాలో కాసిని నీళ్ళు కలిపి తుడిస్తే సరిపోతుంది.