News January 29, 2025

అనకాపల్లి: భార్యను హత్య చేసిన భర్త

image

అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలం ముసిడిపల్లిలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. మద్యం మత్తులో ఉన్న భర్త మంచంపై నిద్రిస్తున్న భార్య మెడకు నైలాన్ తాడును బిగించి చంపేసిన ఘటన తీవ్ర సంచలనం రేపింది. మంగళవారం రాత్రి జరిగిన ఈ ఘటనలో భర్త నారాయణమూర్తి (43) చేతిలో భార్య వరలక్ష్మి (38) హతమయింది. మృతురాలి అన్నయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐ పైడపు నాయుడు, ఎస్సై మల్లేశ్వరరావు బుధవారం కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News December 10, 2025

పంచాయతీ ఎన్నికలు.. స్కూళ్లకు రేపు సెలవు

image

తెలంగాణలో రేపు తొలి విడత ఎన్నికల పోలింగ్ జరగనుంది. 3,800 గ్రామాల్లో సర్పంచ్, వార్డుల సభ్యులను ఎన్నుకోనున్నారు. దీంతో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసిన స్కూళ్లకు విద్యాశాఖ అధికారులు రేపు సెలవు ప్రకటించారు. ఆయా స్కూళ్లకు ఇవాళ కూడా హాలిడే ఉంది. తర్వాత జరిగే 2 విడతల పోలింగ్ నేపథ్యంలో ఈ నెల 13,14(ఆదివారం),16,17న కూడా స్కూళ్లకు సెలవులు ఉండనున్నాయి.

News December 10, 2025

సంగారెడ్డి: ఎన్నికల ప్రచారం చేస్తే కఠిన చర్యలు: కలెక్టర్

image

మొదటి విడత ఎన్నికలు జరిగే 7 మండలాల్లో సైలెంట్ పీరియడ్ అమల్లో ఉందని కలెక్టర్ ప్రావీణ్య బుధవారం తెలిపారు. గుమ్మడిదల, హత్నూర, కంది, కొండాపూర్, పటాన్ చెరు, సదాశివపేట, సంగారెడ్డి మండలాల్లో 9వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి ప్రచార కార్యకలాపాలపై నిషేధం అమల్లో ఉన్నాయన్నారు. ఎవరూ ఎన్నికల ప్రచారం చేయకూడదని సూచించారు.

News December 10, 2025

రాజమండ్రిలో ఈనెల 12న జామ్ మేళా!

image

రాజమండ్రిలోని కలెక్టరేట్ వద్ద ఉన్న వికాస కార్యాలయంలో ఈనెల 12న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. టెన్త్, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా, బీటెక్, ఎంబీఏ ఉత్తీర్ణులైన 35 ఏళ్లలోపు అర్హులైన అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఆసక్తిగల అభ్యర్థులు జాబ్ మేళాలో పాల్గొనాలని ఆమె సూచించారు.