News February 13, 2025
అనకాపల్లి: భార్య మృతితో భర్త ఆత్మహత్య

భార్య మృతితో మనస్తాపానికి గురైన ఏ.నాగ శేషు (62) అనకాపల్లి పట్టణం తాకాశివీధిలో బుధవారం తన ఇంటిలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారని వారికి వివాహం చేసినట్లు ఎస్ఐ అల్లు వెంకటేశ్వరరావు తెలిపారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పోస్టుమార్టంకు పంపించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Similar News
News October 26, 2025
నేషనల్ హెల్త్ సిస్టమ్స్ రిసోర్స్ సెంటర్లో ఉద్యోగాలు

నేషనల్ హెల్త్ సిస్టమ్స్ రిసోర్స్ సెంటర్ 3 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు నవంబర్ 3వరకు అప్లై చేసుకోవచ్చు. వీటిలో సీనియర్ కన్సల్టెంట్, సెక్రటేరియల్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి MBBS/BDS/BHMS/MD/MPH/MBA/ BSc నర్సింగ్, ఫిజియోథెరపితో పాటు పని అనుభవం ఉండాలి. వెబ్సైట్: https://devnetjobsindia.org
News October 26, 2025
కైలాష్ సుందరకాండ పుస్తకాన్ని ఆవిష్కరించిన గవర్నర్

వనవాసి కల్యాణ పరిషత్ ఆధ్వర్యంలో అచ్చంపేటలో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ శ్రీ జిష్ణు దేవ్ శర్మ ముఖ్య అతిథిగా పాల్గొని, తొడసం కైలాస్ మాస్టర్ రచించిన “సోభత ఖడి” సుందరకాండ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రీ మాధవి దేవి, హర్యానా మాజీ గవర్నర్ శ్రీ బండారు దత్తాత్రేయ, వనవాసి కల్యాణ పరిషత్ అధికారి శ్రీ రామచంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.
News October 26, 2025
ఏలూరు: రెండు రోజులు విద్యా సంస్థలకు సెలవులు

‘మొంథా’ తుఫాన్ ప్రభావంతో ఏలూరు జిల్లాలో అక్టోబర్ 27, 28వ తేదీల్లో పాఠశాలలు, కళాశాలలు, అంగన్వాడీలకు సెలవు ప్రకటించారు. తుఫాన్ కారణంగా తీవ్ర గాలులు, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు కలెక్టర్ వెట్రి సెల్వి ఆదివారం తెలిపారు. ప్రైవేట్ యాజమాన్యాలు అదనపు తరగతులు లేదా స్టడీ క్లాసులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు.


