News February 3, 2025
అనకాపల్లి: మత్స్యకారులకు అందని భృతి
చేపల వేట నిషేధానికి సంబంధించి అనకాపల్లి జిల్లాలో మత్స్యకారులకు వేట నిషేధ భృతి ఇప్పటివరకు అందలేదు. ప్రతి ఏటా మాదిరిగా గత ఏడాది ఏప్రిల్ నుంచి జూన్ వరకు చేపల వేటను ప్రభుత్వం నిషేధించింది. జిల్లాలో 27 మత్స్యకార గ్రామాల్లో 2,168 మంది మత్స్యకారులకు ప్రభుత్వం రూ.2.16 కోట్లు చెల్లించాల్సి ఉంది. గత ఏడాది ఎన్నికల కోడ్ అమలులో ఉండడంతో పరిహారం చెల్లించడానికి అవకాశం లేకుండా పోయింది.
Similar News
News February 3, 2025
కోరుట్ల: ధర్మశాల భూమి పూజలో ఎమ్మెల్యే
కోరుట్ల పట్టణంలోని శ్రీ మహాదేవ స్వామివారి ఆలయంలో నూతనంగా నిర్మించబోయే శ్రీ నందీశ్వర ధర్మశాల (కల్యాణ మండపం) భూమిపూజ కార్యక్రమంలో సోమవారం కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యేను శాలువాతో సత్కరించారు. ఆయన వెంట పలువురు బీఆర్ఎస్ నాయకులు తదితరులు ఉన్నారు.
News February 3, 2025
మేడారంలో బోల్తాపడ్డ వాటర్ ట్యాంక్
తాడ్వాయి మండలం మేడారంలో వాటర్ ట్యాంకర్ బోల్తా పడింది. గ్రామ పంచాయతీకి చెందిన వాటర్ ట్యాంకర్ ట్రాక్టర్ మొక్కలకు నీరు పోసేందుకు తీసుకు వెళ్తుండగా తాడ్వాయి – మేడారంలోని మూలమలుపు వద్ద అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో గ్రామ పంచాయతీ సిబ్బంది గజ్జల ఆశయ్య అనే వ్యక్తికి గాయాలైనట్లు సమాచారం.
News February 3, 2025
BREAKING: తెలుగు నిర్మాత ఆత్మహత్య
సినీ నిర్మాత, డ్రగ్ పెడ్లర్ కేపీ చౌదరి (కృష్ణప్రసాద్ చౌదరి) గోవాలో ఆత్మహత్య చేసుకున్నారు. డ్రగ్స్ కేసులో ఇరుక్కోవడం, ఆర్థిక పరిస్థితుల కారణంగా సూసైడ్ చేసుకున్నట్లు ఆయన అనుచరులు చెబుతున్నారు. ఖమ్మం జిల్లాకు చెందిన కేపీ చౌదరి 2016లో సినిమా రంగంలోకి వచ్చారు. తెలుగులో కబాలి సినిమాకు నిర్మాతగా వ్యవహరించారు. 2023లో ఆయన దగ్గర 93 గ్రా. కొకైన్ దొరకడంతో పోలీసులు అరెస్టు చేశారు.