News February 22, 2025
అనకాపల్లి: మధ్యవర్తుల సమక్షంలో గంజాయి సీజ్ చేయాలి: ఎస్పీ

అనకాపల్లి గెజిటెడ్ అధికారులు, మధ్యవర్తుల సమక్షంలో మాత్రమే గంజాయి సీజ్ చేయాలని అధికారులకు జిల్లా ఎస్పీ తుహీన్ సిన్హా సూచించారు. శుక్రవారం పట్టణంలోని జీవీఎంసీ సమావేశ మందిరంలో గంజాయి నిర్మూలన తదితర అంశాలపై నిర్వహించిన వర్క్షాప్లో ఆయన మాట్లాడారు. 161 స్టేట్మెంట్ రికార్డ్ చేసిన అనంతరం మధ్యవర్తులకు చదివి వినిపించారు. న్యాయమూర్తి సమక్షంలో ప్రాసెసింగ్ చేయాలన్నారు.
Similar News
News November 17, 2025
సత్యసాయి భక్తుల కోసం ‘SAI100’ యాప్

పుట్టపర్తిలో సత్యసాయి శతజయంతి ఉత్సవాలకు వచ్చే భక్తుల కోసం ‘SAI100’ యాప్ను ఆవిష్కరించినట్లు జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ తెలిపారు. యాప్లో రోజు వారీగా ఈవెంట్ కార్యకలాపాలు, వసతి, వాహనాల పార్కింగ్ ప్రాంతాలు, తాగునీటి పాయింట్లు, ఆహార పంపిణీ కేంద్రాలు, కమాండ్ కంట్రోల్ సెంటర్ తదితర వివరాలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ఈ యాప్ను భక్తులు, అధికారులు వినియోగించుకోవాలని కలెక్టర్ కోరారు.
News November 17, 2025
జగిత్యాల: 7 ఏళ్ల బాలికపై అత్యాచారం

సారంగాపూర్ మండలంలోని ఓ గ్రామంలో చిన్నారి(7)పై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు SI గీత తెలిపారు. శనివారం రాత్రి బాలిక ఇంటి బయట ఆడుకుంటుండగా పక్కింటి బాపు అనే వ్యక్తి ఇంట్లోకి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. వెంటనే బాలిక రోదిస్తూ కుటుంబ సభ్యులకు విషయం తెలపడంతో వారు PSలో ఫిర్యాదు చేశారు. దీంతో బాపుపై పోలీసులు ఆదివారం కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు.
News November 17, 2025
బాలానగర్లో 9.9 ఉష్ణోగ్రత నమోదు

మహబూబ్ నగర్ జిల్లాలో చలి తీవ్రత రోజుకు పెరిగిపోతుంది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బాలానగర్లో 9.9 డిగ్రీల అత్యంత ఉష్ణోగ్రత నమోదయింది. రాజాపూర్ 10.2, గండీడ్ మండలం సల్కర్ పేట, మిడ్జిల్ 10.5, హన్వాడ 11.3 కోయిలకొండ మండలం సిరి వెంకటాపూర్ 11.4, భూత్పూర్ 11.6, కోయిలకొండ మండలం పారుపల్లి 11.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది.


