News February 26, 2025
అనకాపల్లి: మహాశివరాత్రికి ప్రత్యేక బస్సులు

మహాశివరాత్రికి అనకాపల్లి, నర్సీపట్నం డిపోల నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు జిల్లా ప్రజా రవాణా అధికారిణి కె.పద్మావతి తెలిపారు. కల్యాణపులోవకు అనకాపల్లి డిపో నుంచి 30 బస్సులు, నర్సీపట్నం డిపో నుంచి 45 బస్సులు, దారమట్టానికి నర్సీపట్నం డిపో నుంచి 15 బస్సులు, విజయనగరం జిల్లా పుణ్యగిరికి అనకాపల్లి డిపో నుంచి పది బస్సులు బుధవారం నుంచి 27 సాయంత్రం వరకు అందుబాటులో ఉంటాయన్నారు.
Similar News
News November 20, 2025
MHBD: గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలు: DEO

గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలని DEO దక్షిణామూర్తి అన్నారు. 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు వేడుకలను MHBDలోని గ్రంథాలయంలో నిర్వహించారు. గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా నిర్వహించిన పోటీలలో పాల్గొని విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతి ప్రదానోత్సవం చేశారు. ప్రజలలో సామాజిక, రాజకీయ, వైజ్ఞానిక చైతన్యాన్ని తీసుకురావడంలో గ్రంథాలయాలు ఎంతో తోడ్పడతాయని అన్నారు. కార్యదర్శి తూర్పాటి శ్రీలత ఉన్నారు.
News November 20, 2025
ములుగు: ‘స్వయం ఉపాధి వ్యాపారాలు చేయాలి’

గ్రామీణ ప్రాంత మహిళలు, యువకులు స్వయం ఉపాధి వ్యాపారాలు చేయాలని, ఇందుకోసం ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తుందని జిల్లా ఇండస్ట్రీస్ జనరల్ మేనేజర్ సిద్ధార్థ రెడ్డి అన్నారు. ములుగులోని సంక్షేమ భవన్లో పీఎం-ఈజీపీ పథకాలపై ఆహ్వాన కార్యక్రమం జరిగింది. చిన్న తరహా పరిశ్రమలు నెలకొల్పడానికి, వ్యాపారాలు చేయడానికి ఈ పథకం తోడ్పాటు అందిస్తుందని తెలిపారు. ముందుకు వస్తే రుణ సదుపాయం కల్పిస్తామన్నారు.
News November 20, 2025
SKLM: ‘సివిల్ సర్వీసెస్ ఉచిత కోచింగ్ కోసం దరఖాస్తు చేసుకోండి’

సివిల్ సర్వీస్ ఉచిత కోచింగ్ పొందేందుకు నవంబర్ 25 లోగా దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. 80 ఫీట్ రోడ్డులో గల బీసీ స్టడీ కార్యాలయంలో ధ్రువపత్రాలను సమర్పించిన అనంతరం డిసెంబర్ 5న వెరిఫికేషన్ స్క్రీన్ టెస్ట్ నిర్వహిస్తామన్నారు. కుల ప్రాతిపదిక పైన ఎంపికైన అభ్యర్థులకు డిసెంబర్ 10 నుంచి విజయవాడలోని గొల్లపూడి సర్కిల్లో ఉచిత కోచింగ్ ఇస్తారన్నారు.


