News February 26, 2025
అనకాపల్లి: మహాశివరాత్రికి ప్రత్యేక బస్సులు

మహాశివరాత్రికి అనకాపల్లి, నర్సీపట్నం డిపోల నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు జిల్లా ప్రజా రవాణా అధికారిణి కె.పద్మావతి తెలిపారు. కల్యాణపులోవకు అనకాపల్లి డిపో నుంచి 30 బస్సులు, నర్సీపట్నం డిపో నుంచి 45 బస్సులు, దారమట్టానికి నర్సీపట్నం డిపో నుంచి 15 బస్సులు, విజయనగరం జిల్లా పుణ్యగిరికి అనకాపల్లి డిపో నుంచి పది బస్సులు బుధవారం నుంచి 27 సాయంత్రం వరకు అందుబాటులో ఉంటాయన్నారు.
Similar News
News March 18, 2025
YV సుబ్బారెడ్డి తల్లికి YS విజయమ్మ నివాళి

రాజ్యసభ సభ్యుడు ఒంగోలు మాజీ ఎంపీ YV సుబ్బారెడ్డి తల్లి ఏరం పిచ్చమ్మ పార్థివదేహానికి సోమవారం YS విజయమ్మ పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. పిచ్చమ్మతో ఉన్న అనుబందాన్ని విజయమ్మ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. అయితే మంగళవారం బాపట్ల జిల్లా మేదరమెట్లలో పిచ్చమ్మ అంత్యక్రియలు ఉదయం 10 గంటలకు జరగనున్నాయి.
News March 18, 2025
ఉగ్రవాదులపై దాడులు.. నెక్స్ట్ టార్గెట్ అతడేనా?

PAKలో లష్కరే తోయిబా ఉగ్రవాది అబూ ఖతల్ హతమవడంతో ఆ సంస్థకు పెద్ద దెబ్బే తగిలింది. అయితే తర్వాతి దాడి LET వ్యవస్థాపకుడు, 26/11 దాడి సూత్రధారి హఫీజ్ సయీద్‌పైనే జరిగే ఛాన్సుందని డిఫెన్స్ ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు. 2023 రాజౌరి, 2024 రియాసి దాడుల్లో అభియోగాలు ఎదుర్కొంటున్న ఖతల్‌ను శనివారం గుర్తుతెలియని వ్యక్తులు హతమార్చిన సంగతి తెలిసిందే. ఈ దాడులు LET ఆపరేషన్స్‌ను దెబ్బతీస్తాయని నిపుణులు అంటున్నారు.
News March 18, 2025
అల్లూరి జిల్లాలో టుడే టాప్ న్యూస్

>ఉప్ప తోటల్లో సినిమా షూటింగ్ సందడి>అల్లూరి జిల్లాలో పటిష్ఠ బందోబస్తు నడుమ ప్రారంభమైన పది పరీక్షలు>పది పరీక్షలకు 117 మంది విద్యార్థులు గైర్హాజరు>వీఆర్ పురం: తేనె మంచుతో జీడిమామిడి పూతకు నష్టం>కొయ్యూరులో భానుడి భగభగలు>ఉద్యోగస్థులు విధులకు డుమ్మా కొడితే నేరం..న్యాయమూర్తి>రంపచోడవరం: గ్రీవెన్స్‌కు 82 ఫిర్యాదులు>పెదబయలు: రోగి సహాయకులకు భోజనం పెట్టాలి