News February 19, 2025
అనకాపల్లి: మహిళల భద్రతపై దృష్టి పెట్టాలి

మహిళల భద్రతపై దృష్టి పెట్టాలని విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జట్టి ఆదేశించారు. విశాఖ రేంజ్ కార్యాలయం నుంచి అనకాపల్లి, అల్లూరి, విజయనగరం, శ్రీకాకుళం తదితర జిల్లాల ఎస్పీలతో బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గంజాయి రవాణా కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. హిట్ అండ్ రన్ కేసులలో బాధితులకు పరిహారం అందే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. రహదారి భద్రతపై అవగాహన కల్పించాలన్నారు.
Similar News
News October 22, 2025
తెలంగాణ రైజింగ్-2047 సర్వేలో పాల్గొనాలి: కలెక్టర్

తెలంగాణ రాష్ట్ర భవిష్యత్ రూపకల్పన కోసం ఉద్దేశించిన తెలంగాణ రైజింగ్-2047 సర్వేలో అధికారులు, ప్రజలు పాల్గొనాలని జనగామ కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా కోరారు. సర్వే ఈనెల 25న ముగుస్తుందని తెలిపారు. కావున, జిల్లా ప్రజలు తెలంగాణ అధికారిక వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకొని సర్వేలో భాగస్వాములు కావాలని కోరారు.
News October 22, 2025
జూబ్లీహిల్స్లో నవీన్ యాదవ్, సునీత నామినేషన్లకు ఆమోదం

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక స్క్రూటినీ వేళ రిటర్నింగ్ ఆఫీస్ వద్ద కోలాహలం నెలకొంది. అభ్యర్థులు పోటీలో ఉంటారా? లేదా? అనే వెరిఫికేషన్ ఆసక్తిని పెంచింది. అభ్యర్థులు అయితే కాస్త టెన్షన్ పడ్డారు. సునీత నామినేషన్ రద్దు చేయాలని, నవీన్ యాదవ్ నామినేషన్ రద్దు చేయాలని SMలో ఇరు పార్టీల నేతలు పోస్టులు పెట్టారు. కానీ, పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించిన రిటర్నింగ్ అధికారులు నవీన్ యాదవ్, సునీత నామినేషన్లకు ఆమోదం తెలిపారు.
News October 22, 2025
రానున్న 5 రోజులు పిడుగులతో కూడిన వర్షాలు!

AP: నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం వల్ల రేపు ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA తెలిపింది. రానున్న 5 రోజులు రాష్ట్రంలో విస్తృతంగా పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. తీరం వెంబడి 35-55km/h వేగంతో ఈదురుగాలులు వీచే ఛాన్స్ ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. శనివారం వరకు జాలర్లు వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది.