News April 10, 2025
అనకాపల్లి: మామిడిపండ్ల విక్రయదారులకు జేసీ సూచన

సాంప్రదాయ విధానంలో మగ్గబెట్టిన మామిడిపండ్లనే విక్రయించాలని అనకాపల్లి జిల్లా జాయింట్ కలెక్టర్ జాహ్నవి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు గురువారం ఆమె ఓ ప్రకటన విడుదల చేశారు. జిల్లాలో 12,500 ఎకరాల్లో 20,000 మంది రైతులు మామిడి తోటలను సాగు చేస్తున్నట్లు తెలిపారు. సుమారు 50 వేల మెట్రిక్ టన్నుల మామిడిని జిల్లాలో రైతులు ఉత్పత్తి చేస్తున్నట్లు తెలిపారు. రసాయనాలతో పండ్లను మగ్గపెట్టే విధానాన్ని అరికట్టాలన్నారు.
Similar News
News November 28, 2025
ఇతిహాసాలు క్విజ్ – 80 సమాధానాలు

ప్రశ్న: ఉప పాండవులను ఎవరు, ఎందుకు చంపారు?
సమాధానం: ఉప పాండవులను చంపింది అశ్వత్థామ. కురుక్షేత్రంలో తన తండ్రి ద్రోణాచార్యుడి మరణానికి ప్రతీకారంగా, ఆయనను అన్యాయంగా చంపారని భావించి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. యుద్ధ రీతిని వీడి, నైతికతను మరచి నిద్రిస్తున్న పాండవుల కుమారులను పాండవులుగా భ్రమించి దారుణంగా చంపాడు. కౌరవ సేనాపతిగా చనిపోతున్న దుర్యోధనుడికిచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకున్నాడు.
<<-se>>#Ithihasaluquiz<<>>
News November 28, 2025
డిసెంబర్ నెలలో రేషన్ డిపోలలో రాగుల పంపిణీ: విశాఖ జేసీ

డిసెంబర్ నెలలో రేషన్ డిపోలలో రాగులు పంపిణీ చేయనున్నట్లు జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ శుక్రవారం తెలిపారు. లబ్ధిదారులకు మూడు కేజీల బియ్యానికి బదులుగా మూడు కేజీల రాగులు అందజేయనున్నట్లు వెల్లడించారు. రేషన్ డిపోలకు వెళ్లే లబ్ధిదారులు ఈ విషయాన్ని గమనించి ప్రభుత్వం అందిస్తున్న పోషకాహారాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు.
News November 28, 2025
మెదక్: నామినేషన్ల ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలి: కలెక్టర్

హవేలీఘనపూర్ నామినేషన్ కేంద్రాన్ని కలెక్టర్ రాహుల్ రాజ్ పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. నామినేషన్లు పారదర్శకంగా, క్రమశిక్షణతో సాగాలని, అభ్యర్థులకు సమాన అవకాశాలు కల్పించాలని ఆదేశించారు. 29వ తేదీ చివరి రోజు కావడంతో అధిక సంఖ్యలో నామినేషన్లకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. పత్రాలు సమృద్ధిగా ఉంచి, వెంటనే స్కాన్ చేయాలని, అభ్యర్థులు ఖర్చుల కోసం ప్రత్యేక బ్యాంక్ ఖాతా నిర్వహించాలని ఆయన స్పష్టం చేశారు.


